Begin typing your search above and press return to search.

నెల్లూరులో ఫ్లెక్సీల చిచ్చు.. వైసీపీ - బీజేపీ రచ్చ

By:  Tupaki Desk   |   26 Dec 2020 11:00 PM IST
నెల్లూరులో ఫ్లెక్సీల చిచ్చు.. వైసీపీ - బీజేపీ రచ్చ
X
ఏపీలో పార్టీల మధ్య రాజకీయ వేడి రగులుకుంటోంది. ముఖ్యంగా నెల్లూరులో ప్రస్తుతం ఫ్లెక్సీల రాజకీయం రసకందాయంలో పడింది. వైసీపీలో అంతర్గత వివాదం చల్లారకముందే మరోసారి ఫ్లెక్సీల గొడవ రాజుకుంది.

తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పర్యటన సందర్భంగా పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను నగరపాలక సంస్థ అధికారులు తొలగించడం వివాదాస్పదమైంది. దీనిపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార వైసీపీ నేతల ఫ్లెక్సీలపై లేని అభ్యంతరం బీజేపీ ఫ్లెక్సీలపై ఎందుకొచ్చిందని మండిపడుతున్నారు. అధికార పార్టీకి బీజేపీ నేతలు హెచ్చరికలు జారీ చేశారు.

ఇప్పటికే దివంగత ఆనం రాంనారాయరెడ్డి జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను మున్సిపాలిటీ తొలగించడంతో వివాదం చెలరేగింది. దీనిపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వివరణ ఇవ్వాల్సి వచ్చింది.

అయితే వైసీపీలోని ఆ విభేదాలు చల్లారకముందే ఇప్పుడు బీజేపీ ఫ్లెక్సీలు కూడా తొలగించడంతో వైసీపీ ఇరుకునపడింది. నెల్లూరు బీజేపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు తొలగించడాన్ని కమలం పార్టీ నేతలు తీవ్రంగా తప్పుపడుతున్నారు.