Begin typing your search above and press return to search.
ఫ్లెక్సీలతోనే సీమాంధ్రులు సంతృప్తి చెందుతారా?
By: Tupaki Desk | 28 May 2016 11:19 AM ISTవిభజన జరిగి రెండేళ్లు అవుతున్నా.. దాని గాయం తాలూకు బాధ నుంచి సీమాంధ్రులు ఇంకా బయటపడలేదు. విభజనతో తామెంత నష్టపోయామన్న విషయం రోజులు గడిచేకొద్దీ స్పష్టంగా అర్థమవుతున్నది ఒక ఎత్తు అయితే.. ఆ నష్టానికి పరిహారంగా ఏపీకి అందాల్సిన కేంద్ర సాయం విషయంలో సంతృప్తికరమైన నిర్ణయాలు ఏమీ లేకపోవటం సీమాంధ్రులను ఉడికిపోయేలా చేస్తోంది.
ఇదిలా ఉంటే.. విభజనకు పరిహారంగా ఏపీకి ఐదేళ్ల ప్రత్యేక హోదా ఇస్తామంటూ నాటి ప్రధాని మన్మోహన్ సింగ్.. రాజ్యసభలో హామీ ఇచ్చినా.. మోడీ సర్కారు దాన్ని అమలు చేసే విషయంలో సానుకూలంగా లేకపోవటం.. ఈ అంశంపై ఈ మధ్య కాలంలో బీజేపీ ముఖ్యనేతల నుంచి.. ఏపీ బీజేపీ నేతలు పలువురు చేసిన వ్యాఖ్యలు మరింత మంటపుట్టేలా చేశాయని చెప్పాలి.
మరీ ముఖ్యంగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు లాంటి నేతలు చేసిన బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్లుగా మారాయని చెప్పక తప్పదు. కేంద్రం నుంచి ఏపీకి వచ్చింది ఏమీ లేకున్నా.. చాలానే చేసినట్లుగా చెప్పటం.. రాజధాని గురించి బాబు అదే పనిగా మాట్లాడటం.. లక్షల కోట్ల రూపాయిల సాయం అడగటం ఏమిటంటూ ప్రశ్నించటం.. ఏపీ రాజధాని అంటే నాలుగు ప్రభుత్వ ఆఫీసులన్నట్లుగా వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియోలో సీమాంధ్రులు ఎటకారంగా రియాక్ట్ కావటమే కాదు.. బీజేపీ నాయకత్వంపై దుమ్మెత్తిపోయటం షురూ చేశారు.
సీమాంద్రుల ఆగ్రహా జ్వాలలు బీజేపీ అధినాయకత్వానికి తాకటంతో సీమాంధ్రులలో పార్టీ పట్ల ఉన్న ఆగ్రహం ఏ స్థాయిలో ఉందో అర్థమైంది. దీంతో.. బీజేపీ ముఖ్యనేతలంతా అలెర్ట్ అయిపోవటం.. ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ తీరు పట్ల సీమాంధ్రులు తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారన్న అంశాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లుగా తెలుస్తోంది. దీంతో.. స్పందించిన మోడీ.. ఏపీకి కేంద్రం నుంచి అందిన సాయం గురించి పెద్ద ఎత్తున ప్రచారంచేయాలని.. భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్న సూచన చేసినట్లుగా చెబుతున్నారు.
ఏపీలోని ముఖ్యమైన ప్రాంతాల్లో రాష్ట్రానికి కేంద్రం చేసిన సాయంపై ప్రత్యేక ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటం ద్వారా సీమాంధ్రుల ఆగ్రహాన్ని తగ్గించొచ్చన్న భావన మోడీ అండ్ కో కనిపిస్తుందన్న భావన వ్యక్తమవుతోంది. అయితే.. ఇదెంతవరకూ వర్క్ వుట్ అవుతుందన్నది ఒక సందేహం. ఎందుకంటే.. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినంత మాత్రాన అన్ని తెలిసిన సీమాంధ్రులు మోడీ పట్ల సానుకూలత పెంచుకుంటారనుకుంటే తప్పులో కాలేసినట్లే. ఏపీకి ప్రత్యేక హోదా.. పోలవరం ప్రాజెక్టుకు.. అమరావతి నిర్మాణానికి అవసరమైన నిధులతో పాటు.. విశాఖకు రైల్వే జోన్ లాంటి అంశాలకు సంబంధించి కీలక నిర్ణయాలేవీ మోడీ సర్కారు తీసుకోలేదన్న విషయం ప్రతి ఒక్క సీమాంధ్రుడికి తెలుసు. మరి అలాంటప్పుడు.. కమలనాథులు ఎన్ని ఫ్లెక్సీలు పెడితే మాత్రం సీమాంధ్రుల్ని సంతృప్తి చెందుతారు? అన్నది అసలుసిసలు ప్రశ్న. మరి.. ఇంత సింఫుల్ లాజిక్ బీజేపీ అగ్రనాయకత్వానికి ఎందుకు తట్టలేదో..?