Begin typing your search above and press return to search.

కమలానికి కొత్త దేవుడు.. !

By:  Tupaki Desk   |   6 Sep 2018 5:27 AM GMT
కమలానికి కొత్త దేవుడు.. !
X
రాముడ్ని నమ్ముకుని రాజకీయాలు చేసే భారతీయ జనతా పార్టీ ఇప్పు ఆ దేవుడ్ని మార్చినట్లు కనపడుతోంది. ఇది రాష్ట్ర స్ధాయిలోనే కాదు... జాతీయ స్ధాయిలో కూడా కమలనాథుల కొత్త తీరు ఇదేలా కనిపిస్తోంది. ఇందుకోసం భారతీయ జనతా పార్టీకి వారి మాత్రసంస్ధ రాష్ట్రీయ స్వయం సేవక్ నుంచి కూడా అనుమతి వచ్చినట్లు చెబుతున్నారు. ఇంతకీ ఆ కొత్త దేవుడు ఎవరు అనుకుంటున్నారా. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో కొత్త దేవుడ్ని తెర పైకి తీసుకువస్తున్నారు కమలనాథులు. ఉత్తర్ ప్రదేశ్ యోగి ఆదిత్యానాథ్‌ ను రంగంలోకి తీసుకువచ్చినట్లే తెలంగాణలోనూ - ఆంధ్రప్రదేశ్‌ లోనూ కూడా మఠాధిపతులను - పీఠాధిపతులను పార్టీలోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇందుకోసం ఇరు రాష్ట్రాల్లోనూ శిష్యులున్న శ్రీ పీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామిని రాజకీయ తెరంగేట్రం చేయించాలన్నది భారతీయ జనతా పార్టీ నాయకుల ఆలోచనగా తెలుస్తోంది. దీనికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ నుంచి కూడా అనుమతి లభించినట్టు చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి నగర బహిష్కరణకు గురైన పరిపూర్ణానందకు హైకోర్టులో ఊరట లభించింది. ఆయన నగర ప్రవేశం చేయవచ్చునని తీర్పు రావడంతో ఆయన బుధవారం నాడు హైదరాబాద్ చేరుకున్నారు.

విజయవాడ నుంచి భారీ ర్యాలీగా నగరంలోకి ప్రవేశించిన పరిపూర్ణానందకు భారతీయ జనతా శాసనసభ్యులు - నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పరిపూర్ణానంద మాట్లాడుతూ తెలంగాణను కాషాయ మయం చేస్తామని ప్రకటించారు. దీని వెనుక ఆయన రాజకీయ ప్రవేశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. హైదరాబాద్‌ లో మజ్లిస్ పై ఆధిపత్యం సాధించాలంటే పరిపూర్ణానందను పార్టీలోకి ఆహ్వానించాలని భావిస్తున్నారు. ఇందుకు పరిపూర్ణానంద కూడా సమ్మతించినట్లు కమలనాథులు చెబుతున్నారు. హైదారాబాద్ నుంచి లోక్‌ సభకు పరిపూర్ణనందను ఎన్నికల బరిలో దింపే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే నగర బహిష్కరణతో జంట నగరాలలోని హిందువులకు పరిపూర్ణానంద దగ్గరయ్యారని భారతీయ జనతా పార్టీ తెలంగాణ నాయకులు భావిస్తున్నారు. పరిపూర్ణానంద భారతీయ జనతా పార్టీలో చేరితే జంటనగరాలలో సెటిల్ అయిన ఆంధ్రుల మద్దతు కూడా లభిస్తుందన్నది కమలనాథుల వ్యూహం. దీంతో తొలిసారిగా తెలుగు రాష్ట్రాల్లో ఓ సాధువు, ఓ మఠాధిపతి రాజకీయ తీర్ధం పుచ్చుకోనున్నారు.