Begin typing your search above and press return to search.

రాహుల్ దెబ్బకి ఫేస్ బుక్ తోక ముడిచిందా?

By:  Tupaki Desk   |   18 Aug 2020 1:40 PM IST
రాహుల్ దెబ్బకి ఫేస్ బుక్ తోక ముడిచిందా?
X
ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ఇప్పుడు సోషల్ మీడియా మాస్ అయిన ‘ఫేస్ బుక్’ దూసుకుపోతోంది. కానీ ఎందుకో భారత్ లో ఫేస్ బుక్ స్టాండర్డ్ క్రమేపీ తగ్గుతోందన్న వాదన మొదలైంది. ఎందుకంటే కేంద్రానికి తలొగ్గి బీజేపీ వీడియోలకు ఎక్కువ పబ్లిసిటీ కల్పిస్తోందన్న అపప్రదను మూటగట్టుకుంది.

తాజాగా అమెరికా పత్రిక ‘ది వాల్ స్ట్రీట్ జర్నల్’ భారత్ లో ఫేస్ బుక్, వాట్సాప్ అధికార బీజేపీకి దాసోహమైపోయిందని సంచలన కథనం ప్రచురించింది. ఈ కథనం దేశంలో రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. దీనిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి భారత్ లో బీజేపీకి ఫేస్ బుక్ సపోర్ట్ చేస్తోందని తెలియపరిచాడు.

రాహుల్ గాంధీ ఆరోపణలు దేశంలో ప్రకంపనలు సృష్టించాయి. ఇప్పుడీ ఆరోపణలకు బలం చేకూరేలా చాలామంది గళమెత్తారు. రెచ్చగొట్టే బీజేపీ వీడియోలను ఫేస్ బుక్ ప్రమోట్ చేస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ దెబ్బతో రాహుల్ గాంధీ ట్విట్టర్ అకౌంట్ కు ఎక్కువ ప్రమోషన్ కూడా వచ్చింది. రాహుల్ మెల్లిగా ఆదరణ పొందుతున్నాడని అర్థమైంది. కాంగ్రెస్ హైకమాండ్ తలుచుకుంటే ముందు ముందు మంచి ఫలితాలు వస్తాయని.. రాహుల్ ద్వారా బీజేపీని ఇరుకునపెట్టేలా గళమెత్తించాలని కాంగ్రెస్ మద్దతుదారులు కోరుతున్నారు.