Begin typing your search above and press return to search.
కవిత అడ్డాలో దేవుడు కూడా బీజేపీ వైపేనా?
By: Tupaki Desk | 4 Jun 2019 5:17 PM ISTతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత టైం ఏ మాత్రం బాగోలేనట్లుంది. ఆమె అడ్డా అయిన నిజామాబాద్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిన ఆమె తీవ్ర నిరాశతో ఉన్నారు. ఇదిలా ఉంటే.. అత్తారింటి దగ్గర జరిగిన స్థానిక ఎన్నికల్లోనూ టీఆర్ ఎస్ పార్టీ ఓడి.. బీజేపీ విజయం సాధించింది. ఇదంతా ఒక ఎత్తు అయితే.. నిజామాబాద్ జిల్లా పరిధిలోని ఆర్మూరు మండలంలో జరిగిన పరిషత్ ఎన్నికల ఫలితాన్ని చూస్తే.. కవిత అడ్డాలో దేవుడు సైతం బీజేపీవైపు మొగ్గు చూపుతున్నాడా? అన్న భావన కలగటం ఖాయం.
అదెలానంటే.. ఆర్మూరు మండలం పిప్రికి జరిగిన పరిషత్ ఎన్నికల్లో తొలుత టీఆర్ ఎస్ అభ్యర్థి విజయం సాధించాడు. అది కూడా రెండు ఓట్ల తేడాతో. దీంతో.. బీజేపీ అభ్యర్థి అభ్యంతరం వ్యక్తం చేసి.. రీ కౌంటింగ్ చేయాలని పట్టుబట్టారు. దీంతో.. ఎన్నికల అధికారులు మళ్లీ ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని చేపట్టగా.. అనూహ్యంగా టీఆర్ ఎస్.. బీజేపీ అభ్యర్థులు ఇద్దరికి ఒకటే ఓట్లు వచ్చాయి. ఇరువరికి 690 ఓట్లు రావటంతో.. విజేతను డిసైడ్ చేయటానికి లాటరీ పద్ధతిని అనుసరించాలని డిసైడ్ అయ్యారు.
లాటరీ తీయగా.. అనూహ్యంగా బీజేపీ అభ్యర్థి ఎర్రవ్వకు అనుకూలంగా ఫలితం వచ్చింది. దీంతో.. ఆయన్ను ఎన్నికల విజేతగా ప్రకటించారు. కవిత ఇలాకాగా చెప్పే నిజామాబాద్ లోని పలు చోట్ల బీజేపీ తన సత్తా చాటటం కమలనాథుల్లో ఉత్సాహాన్ని పెంచటమే కాదు.. ఇటీవల బీజేపీ సాధించిన గెలుపు.. అదేదో మోడీ గాలితో గెలవలేదని.. కింది స్థాయిలోనూ బీజేపీ బలపడిందన్న విషయం తాజా ఎన్నికల ఫలితాలతో స్పష్టమైందని చెప్పక తప్పదు.