Begin typing your search above and press return to search.

బీజేపీ వీర్రాజు దెబ్బకి నాయకులు అప్పుడే ఫిర్యాదులు చేశారా?

By:  Tupaki Desk   |   26 Aug 2020 5:20 PM IST
బీజేపీ వీర్రాజు దెబ్బకి నాయకులు అప్పుడే ఫిర్యాదులు చేశారా?
X
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియామకమైన సోము వీర్రాజు ‘దూకుడు ’ సినిమాలో మహేష్ లా అప్పుడే బ్యాంటింగ్ మొదలుపెట్టేసరికి అందరూ బెంబేలెత్తిపోతున్నారట.. బీజేపీలో అసమ్మతులను ఏరివేస్తూ.. పార్టీ వ్యతిరేకుల మీద ఉక్కుపాదం మోపుతూ.. ప్రశ్నించిన మీడియాకు కౌంటర్ లేఖలు రాస్తూ.. అబ్బో.. మన వీర్రాజు ‘దూకుడు2’ సినిమా చూపించేస్తున్నారని బీజేపీ వర్గాల్లో టాక్ నడుస్తోందిప్పుడు.. వీర్రాజు దూకుడు తట్టుకోలేక ఆయన మీద అప్పుడే ఢిల్లీకి వీపరీతంగా ఫిర్యాదులు వెళ్లాయంట.. ఈ ప్రచారం ఆ పార్టీలో సాగుతోంది.

సోము వీర్రాజు పగ్గాలు చేపట్టి నెల కూడా కాకముందే అప్పుడే ముగ్గురిని సస్పెండ్ చేశారు.. వారిలో ఇద్దరినీ అన్యాయంగా సస్పెండ్ చేశారని.. ఏదో సోము వీర్రాజు మార్క్ చూపించుకోవాలని ఇలా చేశాడని అధిష్టానానికి చేసిన ఫిర్యాదులో విన్నవించారట.. జాతీయ పార్టీ అన్నాక నేతల్లో భిన్నాభిప్రాయాలు ఉంటాయని.. వాటి అన్నింటికి నోరెత్తిన వారిని సస్పెన్షన్ చేస్తానంటే పార్టీ బాగు పడదు అని కొందరు ఫిర్యాదులో హితవు పలికారట..

సోము వీర్రాజు నియోజకవర్గం అయిన రాజమండ్రిలోనే బీజేపీ బలోపేతం కావడం లేదని.. జాతీయ పార్టీలో రకరకాల అభిప్రాయాలుంటాయని.. పార్టీలో కేడర్ తో కూర్చొని సెట్ చేసుకోవాలి కానీ కుటుంబ పార్టీల మాదిరి సస్సెండ్ చేసుకుంటూ పోతే నాయకులు ఎవరూ మిగలరు అని ఫిర్యాదులో పేర్కొన్నారట..

సోము వీర్రాజు ఆవేశం తగ్గించుకోవాలని.. అన్ని ప్రాంతాల నాయకులతో సఖ్యతతో ఉండి వైసీపీ,టీడీపీలో అసమ్మతి వాళ్లను గుర్తించి పార్టీలోకి చేర్చుకోవాలి గానీ ఎవరు ఉన్నా లేకున్నా తనికిష్టమైన మాదిరి చేస్తే 2019లో 0.84శాతం ఓటు బ్యాంకు మాత్రమే వచ్చిందని.. ఈసారి అది కూడా రాదు అని బీజేపీ నాయకులే అనుకుంటున్నారట.. ఇప్పుడు ఇదే విషయం ఆ పార్టీ నేతల్లో చర్చనీయాంశమైంది. సోషల్ మీడియాలోనూ ఇదే చర్చ జరుగుతోంది. ఆ నోటా ఈనోటా బయటకు పొక్కింది..