Begin typing your search above and press return to search.

తెలుగు న్యూస్ చానెల్ కు బీజేపీ వార్నింగ్

By:  Tupaki Desk   |   6 March 2020 4:05 PM IST
తెలుగు న్యూస్ చానెల్ కు బీజేపీ వార్నింగ్
X
తెలుగులో న్యూస్ చానెల్ గా కొనసాగుతున్న ఒక మీడియా సంస్థకు, దాంతోపాటు బీజేపీపై తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్న మరికొన్ని మీడియా సంస్థలకు బీజేపీ గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఏపీ బీజేపీ ఇన్ చార్జి సునీల్ దేవ్ ధర్ ఈ మేరకు ఈ హెచ్చరికలు జారీ చేశారు.

బీజేపీ నాయకులను లక్ష్యంగా చేసుకొని ఏకపక్షంగా తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్న తెలుగు మీడియా సంస్థలను సునీల్ దేవ్ ధర్ హెచ్చరించారు. ఇదే వైఖరిని కొనసాగిస్తే ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా వెనుకాడమని స్పష్టం చేశారు.

ఈ మేరకు సునీల్ దేవ్ ధర్ ట్వీట్ చేస్తూ సంచలన కామెంట్స్ చేశారు. బీజేపీ సీనియర్ ఎంపీ జీవీఎల్ సహా మరికొందరు నేతలపై ఓ తెలుగు న్యూస్ చానెల్ తోపాటు కొన్ని వార్త సంస్థలు నకలీ వార్తలు సృష్టించి అభాసుపాలు చేస్తున్నాయని సునీల్ దేవ్ ధర్ మండిపడ్డారు. అలాంటి చానళ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.

తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తాజాగా జీవీఎల్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు మీడియా తప్పుడు వార్త ప్రసారం చేశారని సునీల్ మండి పడ్డారు. ఆ చానెల్ క్షమాపణ చెప్పకుంటే బీజేపీ చర్య తీసుకుంటుందని.. ఆ చానెల్ ను బహిష్కరిస్తుందని హెచ్చరించారు.