Begin typing your search above and press return to search.
సొంత రాష్ర్టంలో మోడీకి అగ్నిపరీక్ష
By: Tupaki Desk | 20 Nov 2015 9:36 PM ISTప్రధానమంత్రి నరేంద్రమోడీకి సొంత రాష్ర్టం గుజరాత్ లో అగ్నిపరీక్ష ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రిజర్వేషన్ల ఉద్యమంతో దేశం చూపును తమ వైపు తిప్పుకొన్న పటేళ్ల ఉద్యమం నాయకులు తాజాగా మరో ఎత్తు వేశారు. తాజాగా పటేళ్లు చేసిన ఈ వ్యూహరచన మోడీ సత్తాను తేల్చుతుందని భావిస్తున్నారు.
గుజరాత్ లోని ఆరు మున్సిపల్ కార్పొరేషన్లకు ఆదివారం నాడు ఎన్నికలు జరుగనున్నాయి. అహ్మదాబాద్ - వడోదర - సూరత్ - రాజ్ కో - భావ్ నగర్ - జామ్ నగర్ లకు ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే ఈ ఎన్నికల బరిలో పటేళ్ల ఉద్యమానికి చెందిన అగ్రనేతలు హోరాహోరిగా తలపడుతున్నారు. పటేళ్ల ఉద్యమానికి సూత్రధాని హార్దిక్ పటేల్ ముఖ్య అనుచరులు ఇద్దరు అరెస్ట్ అయి జైలులో ఉండగా వారి సతీమణులు సాధనా పటేల్ - రేఖా పటేల్ కాంగ్రెస్ అభ్యర్ధులుగా ఎన్నికల బరిలో దిగారు. అలాగే మరికొంతమంది పటేళ్ల ఉద్యమ నాయకులు వేర్వేరు డివిజన్ ల నుంచి ఇండిపెండెంట్ లుగా బరిలో దిగారు. దీంతో గట్టిపోటీ తప్పదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
గుజరాత్ లో బలమైన సామాజిక వర్గంగా ఉన్న పటేళ్ల్లకు 16 శాతంకు పైగా ఓటు బ్యాంకు కలిగి ఉన్నారు. చాలాకాలంగా వీరంతా బీజేపీకి మద్దతు పలుకుతున్నారు. అయితే రిజర్వేషన్ ల కోసం పటేళ్లు చేపట్టి ఉద్యమాన్ని బీజేపీ వ్యతిరేకిస్తున్నందున ఈసారి ఆ పార్టీని ఘోరంగా ఓడించాలన్న పట్టుదలతో పటేల్ కులస్తులు ఉన్నారు. ఇంఉలో మరింత విశేషమేమిటంటే సాధనా పటేల్ - గుజరాత్ సీఎం ఆనంది బెన్ నియోజకవర్గం లో నుంచే పోటీకి దిగింది. మరో ఆసక్తికర అంశమేమిటంటే కొద్దికాలం క్రితం వరకు సాధన - ఆమె భర్త అమ్రిష్ పటేల్ ఇద్దరూ బీజేపీ కార్యకర్తలు! బీజేపీ విజయం కోసం వారిద్దరూ తీవ్రంగా శ్రమించారు. కానీ తమ సామాజికవర్గానికి అన్యాయం జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల బరిలో నిలిచి బీజేపీ పై తగిన ప్రతీకారం తీర్చుకోవాలని అనుకుంటున్నారు.
బీహార్ ఓటమితోనే బీజేపీ ఒకింత నిరాశలో ఉండగా నరేంద్రమోడీ సొంత రాష్ర్టంలో పటేళ్లు గట్టిపోటీ ఇస్తూ బరిలో నిలవడం ఆ పార్టీ నేతలను కలవరంలో పడేసింది.