Begin typing your search above and press return to search.
ఆ సీఎం ‘బెంజ్’ కు.. 400 రథాలతో చెక్
By: Tupaki Desk | 7 Nov 2016 3:09 PM ISTకొత్త సంవత్సరంలో జరగనున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పార్టీలు సమాయుత్తం అవుతున్నాయి. ఎవరికి వారు ఎన్నికల ప్రచారాన్ని తమదైన శైలిలో షురూ చేస్తుండటంతో ఎన్నికల వాతావరణం ఆ రాష్ట్రంలో వచ్చేసింది. అందరి కంటే ముందుగా కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికలప్రచారాన్ని ప్రారంభిస్తే.. ఈ మధ్యన అధికార ఎస్పీ (సమాజ్ వాదీ పార్టీ) ప్రచారం షురూ చేసింది. యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ప్రత్యేక బెంజ్ బస్సును తన ఎన్నికల ప్రచార రథంగా మార్చి ప్రజల్లోకి వెళుతున్నారు.
ఇదిలా ఉంటే.. వీరికి భిన్నంగా కమలనాథులు కాస్త భిన్నంగా తమ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టాలని భావిస్తున్నారు. అధికారపక్షం ఒక్క బెంజ్ బస్సుతో ప్రచారాన్ని నిర్వహిస్తే.. వారికి ప్రచారానికి చెక్ చెప్పేందుకు వీలుగా 400 ఇన్నోవాలను ఎన్నికల రథాలుగా మార్చేసి భారీ ప్రచారాన్ని చేపట్టాలని బీజేపీ భావిస్తోంది. గతంలో ప్రచార రథాలుగా బస్సులను వినియోగించే వారు. అయితే.. చిన్న చిన్న పట్టణాలు.. గ్రామాలకు వెళ్లేందుకు అవకాశం లేని నేపథ్యంలో.. అందుకుభిన్నంగా ఇన్నోవా వాహనానికి మార్పులు చేసి.. మినీ ప్రచార రథాలుగా మారుస్తున్నారు.
దాదాపు 400 ఇన్నోవాల్ని ప్రచార రథాలుగా మార్చేసి.. యూపీ వ్యాప్తంగా తమ విధానాల్ని హోరెత్తించాలన్నది బీజేపీ లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రచారంలో భాగంగా బీజేపీ తీసుకొస్తున్న రథాల్లో నాయకులు ఎవరూ ఉండకపోవటం ఒక విశేషంగా చెప్పాలి. తొలిదశ ప్రచారంలో ఎడెనిమిది నిమిషాల చొప్పున ఉండే రెండు పాటల్ని వినిపించటమే లక్ష్యంగా ప్రచారం సాగుతుంది. ఈ పాటల్లోమహిళల మీద దాడులు.. అధికారపార్టీ ఆరాచకాల్ని వివరించేలా ఈ పాటలు ఉంటాయని చెబుతున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/