Begin typing your search above and press return to search.

ఈయ‌న వ‌ల్లే..జ‌గ‌న్ సేఫ్‌ గా బ‌య‌ట‌ప‌డ్డారు

By:  Tupaki Desk   |   25 Oct 2018 1:55 PM GMT
ఈయ‌న వ‌ల్లే..జ‌గ‌న్ సేఫ్‌ గా బ‌య‌ట‌ప‌డ్డారు
X
విశాఖ ఎయిర్‌ పోర్టులో జగన్‌ పై శ్రీనివాస్‌ రావు అనే యువకుడు కోడి పందాల్లో ఉపయోగించే కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. జగన్ భుజానికి గాయమవడంతో.. ఆయనను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌ కు తీసుకువచ్చారు. నగరంలోని సిటీ న్యూరో ఆస్పత్రిలో జగన్ భుజానికి వైద్యులు శస్త్ర చికిత్స చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశీర్వాదమే తనను రక్షిస్తోందని ఆయన ట్వీట్ చేశారు. ఇలాంటి చర్యలు తనను భయపెట్టలేవు. రాష్ట్ర ప్రజలకు సేవ చేసేందుకు మరింత శక్తిమంతుడిని చేస్తాయని జగన్ పేర్కొన్నారు.

అయితే, ఈ ఎపిసోడ్‌ లో జ‌గ‌న్ సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ‌టం వెనుక పార్టీ సీనియర్ నాయకుడు - శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ చార్జి బియ్యపు మధుసూధ‌నరెడ్డి పాత్ర కీల‌క‌మైన‌ద‌ని ప్ర‌త్య‌క్ష సాక్షులు అంటున్నారు. విశాఖ విమానాశ్రయం లాంజ్‌ లో కూర్చొన్న జగన్ వద్దకు శ్రీనివాస్‌ రావు వచ్చి 160 సీట్లు వస్తాయా? సార్ అంటూ పలకరించాడు. ఇదే స‌మయంలో విజ‌య‌న‌గ‌రానికి చెందిన ఓ నాయ‌కుడిని జ‌గ‌న్‌ తో స‌మావేశం అయ్యేందుకు మ‌ధుసూద‌న్ రెడ్డి ఎదురుచూస్తున్నారు. ఈ స‌మావేశం కోసం ఎదురుచూస్తూ వైఎస్ జగన్‌ ను పిలుస్తున్న స‌మ‌యంలోనే...శ్రీ‌నివాస‌రావు కోడి పందాల కత్తితో దాడి చేసేందుకు ప్ర‌య‌త్నించారు. దీంతో ప్రాణాపాయ‌ ముప్పు త‌ప్పి స్వ‌ల్ప‌గాయంతో జ‌గ‌న్ బ‌య‌ట‌ప‌డ్డారు.

కాగా, ప్ర‌భుత్వం త‌ర‌ఫున వినిపిస్తున్న వాద‌న‌ను ఇటు ప్ర‌త్య‌క్ష సాక్షులు అటు...మ‌ధుసూద‌న్ రెడ్డి త‌ప్పుప‌డుతున్నారు. ప్ర‌త్య‌క్ష సాక్షి మళ్ల విజయప్రసాద్ ప్ర‌కారం సెల్ఫీ తీసుకోవడం కోసం వెయిటర్ శ్రీనివాస్ జగన్ సమీపానికి వచ్చాడని - జగన్ - అతణ్ని దగ్గరకు రానిచ్చి ఫోటోకు పోజిచ్చారనే విష‌యంలో త‌ప్పేమీ లేదంటున్నారు. హోంమంత్రి గానీ - డీజీపీ గానీ చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని ఆయ‌న స్ప‌ష్టం చేస్తున్నారు.