Begin typing your search above and press return to search.

సాక్షి ప్రోమోలో బిత్తిరి సత్తి.. టీవీ9కి పంచ్ ఇచ్చాడా?

By:  Tupaki Desk   |   16 July 2020 2:00 PM IST
సాక్షి ప్రోమోలో బిత్తిరి సత్తి.. టీవీ9కి పంచ్ ఇచ్చాడా?
X
బిత్తిరి సత్తి.. అలియాస్ చేవెళ్ల రవికుమార్.. తెలంగాణ యాస.. భాషతో పాపులర్ అయ్యాడు ఈ కమెడియన్. వీ6లో తీన్మార్ వార్తలతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. దాన్నుంచే సినిమాలు, వివిధ కార్యక్రమాల్లోనూ ఫేమస్ అయ్యాడు. ఆ వీ6లో విభేదాలతో.. భారీ ఆఫర్ ఇవ్వడంతో టీవీ9లోకి జంప్ చేశాడు..

ఇక అంతా బాగానే సాగుతుందనుకుంటున్న టైంలో టీవీ9 నుంచి సడన్ గా బయటకు వచ్చాడు. సత్తి ఎందుకు బయటకొచ్చాడన్నది ఇంతవరకు అధికారికంగా అటు టీవీ చానెల్.. ఇటు సత్తి కూడా బయటపెట్టలేదు.

అయితే ఫాదర్స్ డే సందర్భంగా సత్తి చేసిన స్కిట్ లో తన సొంత నాన్నను పొగుడుతూ ప్రోగ్రాం చేయడం.. అది టెలికాస్ట్ కావడంతో టీవీ9 యాజమాన్యం ఆగ్రహించిందని.. విభేదాలు తలెత్తడంతో సత్తి బయటకొచ్చాడనే టాక్ బయటకు వచ్చింది.

ఆ తర్వాత సత్తి సాక్షిలో ఇటీవలే చేరారు. చేరడం.. చేరడంతోనే తను ఎందుకు వైదొలిగాడు.. కారణమేంటన్నది పరోక్షంగా తొలి ప్రోమోలోనే అందరికీ అర్థమయ్యాలే సూపర్ పంచ్ వేశాడని జర్నలిస్ట్ సర్కిల్స్ లో అనుకుంటున్నారు. తండ్రిపై స్కిట్ చేసినందుకు న్యూసెన్స్ అయ్యి తనను వెళ్లగొట్టారని ఇందులో చూపించాడు. కష్టపడి పైకొచ్చినోడికి ఎక్కడా ఆపలేరని.. తండ్రిని గౌరవించే సాక్షిలో ఇక తనకు తిరుగులేదని.. ఇక ఎక్కడికి తిరగను అంటూ బిత్తిరి సత్తి ప్రోమోలో చూపించడం విశేషం.

ఈ ప్రొమో టీవీ9కు పంచ్ లాగానే సత్తి తయారు చేశాడని జర్నలిస్ట్ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తన తండ్రిపై స్కిట్ చేసినందుకు వెళ్లగొట్టారని.. తండ్రిని కీర్తించే చోటకు వచ్చానని చూపించాడు. ఇక సత్తి సత్తాను చూపిస్తానంటూ పరోక్షంగా టీవీ9కు సెటైర్లు వేశారని వారు అంచనావేస్తున్నారు.