Begin typing your search above and press return to search.

హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ కు చేదు అనుభవం

By:  Tupaki Desk   |   29 Sept 2021 8:00 PM IST
హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ కు చేదు అనుభవం
X
హుజూరాబాద్ లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు చేదు అనుభవం ఎదురైంది. మృతుడి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన ఈటలకు నిరసన సెగ తగిలింది.

హుజూరాబాద్ నియోజకవర్గంలోని పాపయ్యపల్లిలో ప్రవీణ్ యాదవ్ అనే వ్యక్తి కొద్దిరోజుల క్రితం చనిపోయాడు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు బుధవారం అక్కడికి ఈటల రాజేందర్ వెళ్లారు. ఈ క్రమంలోనే మృతుడి కుటుంబ సభ్యులు ఆయనకు ఊహించని షాక్ ఇచ్చారు.

ఈటలను చూడగానే మృతుల కుటుంబ సభ్యులు తిట్ల దండకం మొదలుపెట్టారు. ఈటల వల్లే తమ బిడ్డ మృతిచెందాడని మృతుడి కుటుంబీకులు ఆరోపించారు.

ఈ హఠాత్ పరిణామానికి షాక్ అయిన ఈటల రాజేందర్ ఏం చేయాలో తెలియక పోలీసుల సాయంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ప్రస్తుతం ఈటల రాజేందర్ తెలంగాణలో తీవ్ర ఉత్కంఠ రేపుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల బరిలో బీజేపీ తరుఫున నిలబడ్డారు. షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. అక్టోబర్ 30న ఎన్నికలు జరుగనున్నాయి. ఈ క్రమంలోనే సుడిగాలి పర్యటన చేస్తున్న ఈటల రాజేందర్ తాజాగా పరిణామం మింగుడు పడకుండా ఉంది.