Begin typing your search above and press return to search.

గోవాలో కాంగ్రెస్‌కు చేదు అనుభవం.. దుకాణం మూసేయాల్సిందే!

By:  Tupaki Desk   |   11 March 2022 3:43 AM GMT
గోవాలో కాంగ్రెస్‌కు చేదు అనుభవం.. దుకాణం మూసేయాల్సిందే!
X
ఏపార్టీకైనా.. కాన్ఫిడెన్స్ ఉండాల్సిందే. కానీ,ఓ వ‌ర్ కాన్పిడెన్స్ ఎప్పుడు ప‌నికిరాదు. ఇదే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో నిజ‌మైంది. తాజాగా వెల్లడైన ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ ప‌రిస్థితి దారుణంగా మారింది. ముఖ్యంగా యూపీ స‌హా కీల‌క‌మైన పంజాబ్‌లోనూ కాంగ్రెస్ త‌న పంజాను విస‌ర‌లేక పోయింది.

ఇక‌, తీర ప్రాం త రాష్ట్రం గోవా విష‌యానికి వ‌స్తే.. ఇక్క‌డ కూడా కాంగ్రెస్ తీవ్ర‌స్థాయిలో న‌ష్ట‌పోయింది. మొదటి నుంచి ఇక్క‌డ కాంగ్రెస్ ఓవ‌ర్ కాన్ఫిడెన్స్‌తో ఉంది. దీంతో వ‌రుస‌గా మరోసారి దెబ్బ తిన్నారు.

టిక్కెట్లు ఇచ్చే విషయం నుంచి ప్రచారం చేసే వ‌ర‌కు కాంగ్రెస్ నాయకులు ప్రవర్తించిన తీరు పరోక్షంగా ఆ పార్టీ నాయకుల ఓటమికి కారణం అయ్యింద‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో తీవ్రంగా న‌ష్ట‌పోయిన కాంగ్రెస్ ఇప్పుడు గోవాలో కూడా సేమ్ సీన్ రిపీట్ కావడంతో షాక్ అయ్యారు.

గోవాలో హంగ్ వస్తుంది, ఎలాగైనా ఇతర పార్టీల నాయకులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యాలని నాలుగు రోజుల నుంచి రిసార్టు రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇప్పుడు రిసార్టు బిల్లులు త‌ప్ప మిగిలింది ఏమీ క‌నిపించ‌డం లేదు.

ప్ర‌స్తుతం వెలువ‌డిన ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల్లో గోవాలో మరోసారి బీజేపీ అధికారంలోకి రావడానికి సిద్దం అయ్యింది. 40 శాసన సభ నియోజక వర్గాల్లో భారీ విజయం సాధించిన బీజేపీ అధికారంలోకి రావడానికి సిద్దం అయ్యింది.

దీంతో ఎలాగైనా గోవాలో అధికారం చేపట్టాలని కలలుకన్న కాంగ్రెస్ పార్టీ ఆశలు, వారి స్కెచ్ లు చెల్లాచెదురు అయ్యాయి. గోవా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల దెబ్బతో ఇప్పటికే గోవాలో మకాం వేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.