Begin typing your search above and press return to search.
బాలకృష్ణ గో బ్యాక్..ఎమ్మెల్యే బాలకృష్ణ కి చేదు అనుభవం !
By: Tupaki Desk | 9 March 2021 2:14 PM ISTటాలీవుడ్ సీనియర్ హీరో ,టీడీపీ కీలక నేత , హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కు తన సొంత నియోజకవర్గంలోనే చేదు అనుభవం ఎదురైంది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బాలయ్య తన నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే సోమవారం చివరి రోజు ఎన్నికల ప్రచారం సందర్భంగా ఎమ్మెల్యే బాలకృష్ణకు చేదు అనుభవం ఎదురైంది. సోమవారం మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి చివరి తేదీ కావడంతో బాలకృష్ణ మరింత జోరుగా ప్రచారాన్ని సాగించారు. అయితే బాలకృష్ణ 21వ వార్డు మోత్కుపల్లిలో ప్రచారం నిర్వహిస్తుండగా కొందరు స్థానికులు గోబ్యాక్ బాలకృష్ణ అంటూ నినాదాలు చేశారు.
బాలకృష్ణతో పాటు స్థానిక నాయకులు ఇదివరకే ఇక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించారని కొందరు స్థానికులు తెలిపారు. తిరిగి సోమవారం సాయంత్రం అక్కడికి చేరుకోవడంతో కొందరు స్థానికులతో పాటు వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ,వైసీపీ కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. చివరకు పోలీసుల జోక్యంతో ఇరువర్గాలు శాంతించాయి. ఇక, ఆ ప్రాంతంలో సాయంత్రం 4 గంటల సమయానికి ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్, వైసీపీ అభ్యర్థి మారుతీరెడ్డిల ప్రచారానికి పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చిన బాలకృష్ణను పలువురు వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. వైసీపీకి కేటాయించిన సమయంలో ప్రచారానికి ఎలా వస్తారని అని అడిగారు. గోబ్యాక్ బాలకృష్ణ.. జై జగన్.. అని నినాదాలు చేశారు.ఇక, హిందూపురం మున్సిపల్ ఎన్నికల్లో బాలకృష్ణ అన్నీ తానై ప్రచారం నిర్వహించారు. ఒక్క వార్డు కూడా ఏకగ్రీవం కాకుండా చూసుకున్నారు. అధికార పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తూ ప్రచారం కొనసాగించారు. ప్రచార క్రమంలో ఆయన ఓ అభిమానిపై చేయి చేసుకోవడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. అయితే బాలయ్య తనను టచ్ చేయడం తనకు చాలా సంతోషంగా అనిపించిందని.. ప్రత్యర్థులు కావాలనే దీన్ని వివాదం చేస్తున్నారని ఆ అభిమాని వెల్లడించడం గమనార్హం