Begin typing your search above and press return to search.

పాట పాడి ఇరుకున్న బిత్తిరిసత్తి

By:  Tupaki Desk   |   4 April 2019 8:37 AM GMT
పాట పాడి ఇరుకున్న బిత్తిరిసత్తి
X
తెలంగాణ యాస - భాషతో యాంకర్ గా - ప్రజెంటర్ గా బిత్తిరి సత్తికి మంచి గుర్తింపు ఉంది. ప్రతీ రోజురాత్రి 9.30 గంటలు అయ్యిందంటే చాలు తీన్మార్ వార్తల్లో బిత్తిరి సత్తి చేసే కామెడీ కోసం జనాలు ఎదురుచూస్తారంటే అతిశయోక్తి కాదు.. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో పాపులారిటీ సంపాదించుకున్న బిత్తిరి సత్తి తాజాగా వివాదాల్లో చిక్కుకున్నారు.

ఇలా ఎంతో క్రేజ్ ఉన్న బిత్తిరి సత్తి తాజాగా ఏపీ ఎన్నికల వేళ ఓ ప్రధాన పార్టీ కోసం ఓ పాట పాడారు. ప్రజలకు ఓటు విలువ తెలిసేలా ఉన్న ఈ పాటను ఎంతో ప్రొఫెషనల్ సింగర్ గా ఆలపించి ఔరా అనిపించాడు. అయితే ఇందులో ఓ రాజకీయ పార్టీకి అనుకూలంగా పాడడం వివాదంగా మారింది. అరచేతిలో స్వర్గం చూపే ఓ నాయకుడిని నమ్మవద్దంటూ పాడడం వివాదాస్పదమైంది. ఆ పార్టీ వారు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బిత్తిరి సత్తి పాడిన పాటకు ఆ పార్టీకి వ్యతిరేకమైన వారు తీవ్ర విమర్శలు కురిపిస్తుండగా.. అనుకూలంగా పాడిన వారు కీర్తిస్తున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడు బిత్తిరి సత్తి టార్గెట్ గా పెద్ద పంచాయితీ నడుస్తోంది. ఏ రాజకీయ ప్రయోజనాలు ఆశించి బిత్తిరి సత్తి ఓ పార్టీకి అనుకూలంగా పాట పాడారని కొందరు విమర్శిస్తున్నారు.