Begin typing your search above and press return to search.

బుఖారెస్ట్ క్యాంపులో ఇండియన్ స్టూడెంట్ బర్త్ డే

By:  Tupaki Desk   |   1 March 2022 9:30 AM GMT
బుఖారెస్ట్ క్యాంపులో ఇండియన్ స్టూడెంట్ బర్త్ డే
X
రష్యా-ఉక్రెయిన్ నడుమ భీకర యుద్ధం కొనసాగుతోంది. దాదాపు ఆరు రోజుల నుంచి అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కీవ్ లక్ష్యంగా రష్యా బలగాలు దూసుకు వస్తున్నాయి. మరోవైపు అక్కడ చిక్కుకుపోయిన భారతీయులను తరలించేందుకు భారత ప్రభుత్వం కృషి చేస్తుంది. అక్కడ ఉన్న వారందరినీ ఆపరేషన్ గంగ పేరుతో స్వదేశానికి తీసుకొస్తున్నారు.

ఇప్పటికే పదుల సంఖ్యలో విద్యార్థులు ఇండియాకు చేరుకున్నారు. మరికొందరు ఉక్రెయిన్ చుట్టుపక్కల ఉన్న దేశాల్లో ఏర్పాటు చేసిన క్యాంపులకు చేరుతున్నారు. అక్కడి నుంచి ఇండియా తీసుకొచ్చేందుకు కేంద్రప్రభుత్వం ప్రత్యేక విమానంలో ఏర్పాటు చేసింది.

ఈ నేపథ్యంలో ఓ భారతీయ విద్యార్థిని ఉక్రెయిన్ నుంచి రొమేనియా దేశానికి చేరుకుంది. బుఖారెస్ట్ లో ఏర్పాటు చేసిన క్యాంపులో బిక్కుబిక్కుమంటూ గడుపుతోంది. ఆమెతోపాటు మరికొందరు మిత్రులు కూడా ఉన్నారు. ఆ అమ్మాయికి సన్నిహుతులు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. అది విన్న క్యాంపు నిర్వాహకులు ఆమె బర్త్ డే ను గ్రాండ్ గా జరపాలనుకున్నారు.

ఈ ఆపద వేళ పిల్లలు టెన్షన్ పడుతున్నారని... వారిని ఖుష్ చేయాలని భావించారేమో..!

విద్యార్థిని స్నేహితులు, క్యాంపు నిర్వాహకులు కలిసి బర్త్ గర్ల్ కి సర్ ప్రైజ్ ఇచ్చారు. ఓ స్టయిలిష్ కేక్ ను తీసుకు వచ్చి కట్ చేయించారు. అక్కడ ఉన్న వారంతా కూడా వచ్చి... ఆమెకు బర్త్ డే విషెస్ చెప్పారు. అంతేకాకుండా పుట్టిన రోజు వేళ ఆందోళన వద్దని... హ్యాపీ గా ఉండాలని సూచించారు. క్షేమంగా ఇంటికి వెళ్తారంటూ ధైర్యం చెప్పారు. అయితే ఈ ఆపద కాలం లోనూ అక్కడి వారి రెస్పాన్స్ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఓ విద్యార్థి పట్ల వారు చూపిన ప్రేమను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. బుఖారెస్ట్ లో జరిగిన ఆ పుట్టిన రోజు వేడుక ఫొటోలు ప్రస్తతం వైరల్ గా మారాయి. ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ... వివిధ సామాజిక మాధ్యమాల వేదికగా పోస్ట్ చేస్తున్నారు.

భారతీయ విద్యార్థులను ఉక్రెయిన్ నుంచి తీసుకు రావడానికి ఏర్పాటు చేసిన ఆపరేషన్ గంగ వేగవంతం చేస్తున్నారు. వేగంగా తరలించేందుకు విమాన రంగాన్ని ఉపయోగించుకునే యోచనలో ఉన్నారు. దీని ద్వారా మరింత మందిని వేగంగా స్వదేశానికి తీసుకు వచ్చేందుకు వీలు కలుగుతుంది. ఆ దేశ రాజధాని కీవ్ నుంచి ఇండియన్స్ బయటకు వెళ్లాలని ఎంబసీ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది.