Begin typing your search above and press return to search.

కరోనా కల్లోలం: స్మశానం ఫుల్ తో మార్చురీగా ఎయిర్ పోర్టు

By:  Tupaki Desk   |   28 March 2020 2:40 PM IST
కరోనా కల్లోలం: స్మశానం ఫుల్ తో మార్చురీగా ఎయిర్ పోర్టు
X
చైనాలో తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్ యూరప్ ను అతలాకుతలం చేస్తోంది. స్వయంగా బ్రిటన్ ప్రధాని కి కూడా కరోనా సోకడం యావత్ ప్రపంచాన్ని షాక్ కు గురిచేసింది. బ్రిటన్ ఆరోగ్యశాఖ మంత్రికి, సెక్రెటరీకి కూడా కరోనా సోకింది. శనివారం వరకు ప్రపంచ వ్యాప్తంగా కరోనా 5,97,267 లక్షల మందికి సోకింది. ఇందులో 27365 మంది మరణించారు. ఇందులో అత్యధికులు యూరప్ దేశలకు చెందిన వారే కావడం అక్కడ మరణాల తీవ్రతకు అద్దం పడుతోంది.

ఇటలీ లోనే సుమారు 10వేల మంది మరణించారు. స్పెయిన్ లో 5వేలు, ఫ్రాన్స్ లో 1700, యూకే లో 759మంది మరణించారు.

బ్రిటన్ దేశంలో మరణాల రేటు ఎక్కువై పోతోంది. 15వే పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ లండన్ తర్వాత మిడ్ లాండ్స్ లో కరోనా మరణాలు కలవరపెడుతున్నాయి. దీంతో అక్కడ స్మశానాలు ఫుల్ అయిపోయాయి. దీంతో చేసేందేం లేక ప్రఖ్యాత బర్మింగ్ హమ్ ఎయిర్ పోర్టును మార్చురీగా మార్చేశారు. ఇంతటి దారుణమైన పరిస్థితి బ్రిటన్ లో దాపురించింది.

బర్మింగ్ హమ్ ఎయిర్ పోర్టులో ప్రత్యేకంగా మార్చురీ గదులను ఏర్పాటు చేస్తున్నారు. 1500 మృతదేహాలను భద్రపరిచేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎయిర్ పోర్టును మార్చురీగా మార్చడం ఎవరికి ఇష్టం లేకున్నా.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోలేక తప్పలేదని బ్రిటన్ ప్రభుత్వం తెలిపింది.