Begin typing your search above and press return to search.
'యుద్ధానికి సిద్ధం' .. చైనాకి వార్నింగ్ ఇచ్చిన బిపిన్ రావత్ !
By: Tupaki Desk | 24 Aug 2020 12:00 PM ISTగత కొన్ని రోజులుగా దేశ సరిహద్దుల్లో చైనా తన చర్యలతో భారత్ కి భయం చూపించాలని దుందుడుకు చర్యలను ప్రారంభించింది. అయితే , ఒక్కసారిగా కొట్టడం ప్రారంభిస్తే .. వెన్నుచూపే ప్రసక్తే లేని భారత్ చైనాకి తగిన సమాధానం చెప్పాలని భావిస్తుంది. ఈ క్రమంలోనే ... భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ స్పందిస్తూ డ్రాగన్ దేశానికి హెచ్చరిక చేశారు. చైనా చర్యలను తిప్పికొట్టడానికి భారత సైన్యం పూర్తిగా సిద్ధంగా ఉందని , భారత్-చైనా మధ్య జరుగుతోన్న చర్చలు విఫలమైతే తాము సైనికపర చర్యలకు సిద్ధమని ప్రకటించి చైనా కి గట్టి వార్నింగ్ ఇచ్చారు.
సరిహద్దులో బలగాల ఉపసంహరణకు చర్చలు జరుగుతున్నప్పటికీ.. డ్రాగన్ మాత్రం తన బలగాలను వెనక్కి తీసుకోవడానికి ఏ మాత్రం ఇష్టపడటం లేదు. ఈ నేపథ్యంలో రావత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. నియంత్ర రేఖ ఉల్లంఘనలను నిరోధించడానికి, సమస్యను శాంతియుతంగా పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఎల్ఏసీ వెంబడి యధాతథ స్థితిని పునరుద్ధరించడానికి తీసుకుంటున్న చర్యలన్నీ విఫలమైతే.. రక్షణ బలగాలు సన్నద్ధంగా ఉన్నాయని ఆయన తెలిపారు. చర్చలు ఫలించకపోతే ఆర్మీకి రంగంలోకి దింపడానికి, యుద్ధానికి కూడా సిద్ధమని ప్రకటించారు. దీన్ని బట్టి చూస్తే ఇప్పటికే ఇండియన్ ఆర్మీ అన్ని పనులను సిద్ధం చేసుకున్నట్టు అర్థమౌతుంది.
సైనికల బలగాల ఉపసంహరణపై గత రెండున్నర నెలలుగా భారత్, చైనా మధ్య అనేక దఫాలుగా మిలటరీ, దౌత్య మార్గాల్లో చర్చలు జరిగాయి. ఎన్ని చర్చలు జరుగుతున్నా కూడా ఫలితం మాత్రం రాలేదని తెలుస్తోంది. ఏప్రిల్‌కి ముందు ఉన్న యధాతథ స్థితిని చైనా ఆర్మీ కొనసాగించాలని భారత సైన్యం పట్టుబడుతోంది. అయితే, ఇందుకు చైనా ఆర్మీ ససేమిరా అంటుండడంతో భారత్ తదుపరి చర్యలకు సిద్ధమవుతోంది. కాగా, ఇప్పటికే గాల్వన్ లోయతో పాటు పలు ప్రదేశాల నుంచి చైనా సైన్యం వెనక్కి వెళ్లింది. అయితే, పాంగాంగ్ త్సో, డెప్సాంగ్ వంటి ప్రాంతాల నుంచి వైదొలగడం లేదని సమాచారం. ఈ నేపథ్యంలో బిపిన్ రావత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటి వరకూ ఐదుసార్లు కమాండర్ స్థాయి చర్చలు జరగా.. చైనా బలగాలను పూర్తిగా ఉపసహరించాలని భారత్ స్పష్టం చేసింది. శీతాకాలంలో లడఖ్ లో భారీగా బలగాల మోహరింపు కష్టం అవుతుంది. కానీ చైనాను కట్టడి చేయడం కోసం తూర్పు లడఖ్ లోని కీలక ప్రాంతాల్లో చలి కాలంలోనూ ఇదే స్థాయిలో బలగాలను మోహరించడం కోసం భారత్ సన్నద్ధం అవుతోంది. చైనా బలగాలు దుందుడుకుగా వ్యవహరిస్తే ధీటుగా బదులిచ్చేందుకు భారత బలగాలు సిద్ధంగా ఉన్నాయి.