Begin typing your search above and press return to search.

వెండితెర‌పై ఐఏఎస్ రోహిణి సింధూరి జీవితం.. టైటిల్ ఇదే!

By:  Tupaki Desk   |   11 Jun 2021 12:00 PM IST
వెండితెర‌పై ఐఏఎస్ రోహిణి సింధూరి జీవితం.. టైటిల్ ఇదే!
X
సినీ, రాజ‌కీయ ప్ర‌ముఖుల జీవితాల ఆధారంగా సినిమాలు తెర‌కెక్క‌డం సాధార‌ణ‌మే. కానీ.. ఇత‌రుల‌ బ‌యోపిక్ లు అరుదుగా వ‌స్తుంటాయి. అలాంటి అరుదైన బ‌యోపిక్ ఒక‌టి సిద్ధ‌మ‌వుతోంది. సంచ‌ల‌న ఐఏఎస్ రోహిణి సింధూరి జీవితం వెండితెర‌పై ఆవిష్కృతం కాబోతోంది. క‌ర్నాట‌క కేడ‌ర్ కు చెందిన ఈ తెలుగు ఐఏఎస్.. ప‌వ‌ర్ ఫుల్ ఆఫీస‌ర్ గా పేరు తెచ్చుకున్నారు. ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా విధులు నిర్వ‌ర్తిస్తున్న ఆమె.. త‌ర‌చూ ట్రాన్స్ ఫ‌ర్ల‌ను ఫేస్ చేస్తున్నారు. ప‌నిచేసిన ప్ర‌తిచోటా త‌న‌దైన మార్కు చూపిస్తున్న రోహిణి లైఫ్ ను సినిమాగా తీసేందుకు సిద్ధ‌మైంది శాండ‌ల్ వుడ్.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు చెందిన రోహిణి సింధూరి.. 2009లో సివిల్స్ సాధించారు. నేష‌న‌ల్ లెవ‌ల్లో 43వ అత్యుత్త‌మ ర్యాంకు సాధించిన ఈమె.. క‌ర్నాట‌క కేడ‌ర్ కు ఎంపిక‌య్యారు. 2011లో త‌మ‌కూరు జిల్లా అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ గా తొలిపోస్టింగ్ తీసుకున్నారు. ఈ ప‌దేళ్ల కాలంలో ప‌లుమార్లు ఉద్యోగోన్న‌తి సాధించారు. అదే స‌మ‌యంలో ట్రాన్స్ ఫ‌ర్లు కూడా వ‌చ్చాయి. ముక్కుసూటిగా వ్య‌వ‌హ‌రిస్తార‌నే పేరున్న సింధూరి.. ప‌నిచేసిన ప్ర‌తిచోటా త‌న మార్కు చూపించ‌డానికి ప్ర‌య‌త్నించారు. ఈ క్ర‌మంలోనే ప‌లు వివాదాలు కూడా వ‌చ్చాయి.

ఈ ప్ర‌ధానాంశాల‌తోనే సినిమా రూపొందించేందుకు సిద్ధ‌మ‌య్యారు కృష్ణ‌స్వ‌ర్ణ‌సంద్ర‌. స్వీయ నిర్మాణంలో ఈయ‌నే తెర‌కెక్కించ‌బోతున్నారు. ప్ర‌స్తుతం స్క్రిప్టు తుదిద‌శ‌లో ఉంద‌ని, త్వ‌ర‌లోనే సినిమా ప్రారంభించ‌బోతున్నామ‌ని చెప్పారు. విధి నిర్వ‌హ‌ణ‌లో ఓ అధికారి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? అనే కీ పాయింట్ ఆధారంగానే ఈ సినిమా రూపు దిద్దుకోనుంద‌ని చెప్పారు.

ఈ చిత్రం కోసం ‘భార‌త సిందూరి’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. లీడ్ రోల్ లో క‌న్న‌డ బిగ్ బాస్ కంటిస్టెంట్ పాండ‌వ‌పుర న‌టించ‌బోతున్న‌ట్టు స‌మాచారం. ఇప్ప‌టి వ‌ర‌కు ఈమె ఒక‌టీ రెండు చిత్రాల్లో మాత్ర‌మే న‌టించారు. థియేట‌ర్ ఆర్టిస్టుగానే చాలా పాపుల‌ర్ అయ్యారు. త్వ‌ర‌లో మిగిలిన వివ‌రాలు వెల్ల‌డికానున్నాయి.