Begin typing your search above and press return to search.

బిల్ గేట్స్.. బఫెట్.. అంబానీ లాంటోళ్లు అలాంటి బట్టలు అందుకేనట

By:  Tupaki Desk   |   25 May 2022 3:00 AM GMT
బిల్ గేట్స్.. బఫెట్.. అంబానీ లాంటోళ్లు అలాంటి బట్టలు అందుకేనట
X
వాళ్లు సాదాసీదా వ్యక్తులు కాదు. వందలాది కోట్లు ఉన్న ప్రపంచ ప్రజల్ని.. గుప్పెడు మంది తెగ ప్రభావితం చేస్తుంటారు. అంతలా ప్రభావితం చేసే వారిలో అపర కుబేరులుగా పేరున్న ముకేశ్ అంబానీ.. బిల్ గేట్స్.. వారెన్ బఫెట్ లాంటోళ్లు ఉన్నారు. వారికి సంబంధించిన ఒక అంశంలో అందరూ అచ్చుగుద్దినట్లుగా ఒకేలా ఉంటారు.

అదేమంటే.. అపర శ్రీమంతులైన వారు తాము ధరించే దుస్తుల్ని బ్రాండెడ్ కాకుండా సాదాసీదా వాటిని వేసుకునేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తుంటారు. దానికి సంబంధించిన ఫోటోలు అప్పుడప్పుడు బయటకు వచ్చి.. చాలామందిని ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి.

అపర శ్రీమంతులు అయి ఉండి.. ఇలాంటి అన్ బ్రాండెడ్ దుస్తులు ఎందుకు వేసుకుంటారు? అన్న సందేహం కలుగక మానదు. తాజాగా ఆ సీక్రెట్ బయటకు వచ్చేసింది. తోపుల్లాంటి ప్రముఖులు సాదాసీదా దుస్తులు ఎందుకు ధరిస్తారు. టాప్ బ్రాండెడ్ దుస్తుల్ని ఎందుకు ఎంపిక చేసుకోరన్న సందేహానికి సమాధానం చెప్పేశారు ప్రముఖ పారిశ్రామికవేత్త కమ్ ఆర్పీజీ గ్రూపు ఛైర్మన్ హర్ష్ గోయెంకా. మిగిలిన వారికి మాదిరే ఆయనకు ఇలాంటి డౌటే రావటంతో.. ఆయన తనకున్న పరిచయస్తుల్ని అడిగినట్లు వెల్లడించారు.

తానో బిలియనీర్ ను ఇదే ప్రశ్నను అడిగితే.. ఆయనో ఆసక్తికర విషయాల్ని వెల్లడించారన్నారు. ఆయన చెప్పిన మాట విస్మయానికి గురి చేయక మానదు. ఇంతకూఆ విషయం ఏమిటన్నది హర్ష్ మాటల్లోనే చెప్పాల్సి వస్తే.. ‘‘ఉతికి పారేసే బట్టల మీద ఎక్కువగా డబ్బులు వెచ్చించడం వృధా ప్రయాస.

ఎంత ఖరీదై బట్టలైన కొంత కాలానికి పాడైపోతాయి లేదా చినిగిపోతాయి. అందుకే దుస్తుల మీద పెట్టే డబ్బులేవో ఎక్కడైనా పెట్టుబడి పెట్టి.. ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించడం ఉత్తమం. నేను ఎలాంటోడ్ని? నా విలువ ఏంటి? అనేది నా పని నిర్ణయిస్తుంది.

అంతే కానీ నేనే ధరించే బ్రాండెడ్‌ బట్టలు కాదు’’ అని చెప్పినట్లుగా పేర్కొన్నారు. ఈ కారణంతోనే చాలా మంది వ్యాపార రంగానికి చెందిన బిలియనీర్లు ఇతర సెలబ్రిటీల మాదిరి దుస్తులతో డబ్బును ప్రదర్శించేందుకు పెద్దగా ఆసక్తి చూపరన్న మాట. ఏమైనా చాలామందికి తెలియని నిజాన్ని సరైన రీతిలో చెప్పారని చెప్పాలి.