Begin typing your search above and press return to search.

మ‌న ఐటీ ఉద్యోగుల‌కు కొత్త షాక్

By:  Tupaki Desk   |   9 July 2016 12:50 PM GMT
మ‌న ఐటీ ఉద్యోగుల‌కు కొత్త షాక్
X
బ్రెగ్జిట్ దెబ్బ‌తో ఆదాయం కోల్పోయే ప్ర‌మాదం ఎదుర్కుంటున్న భార‌తీయ ఐటీ కంపెనీల‌కు మ‌రో షాకింగ్ ప‌రిస్థితి ఎదురైంది. భారతీయ ఐటీ కంపెనీలు - దేశ ఐటీ నిపుణులకు షాకిచ్చేలా కొత్త బిల్లును అమెరికా సెనెట్‌ లో ప్ర‌వేశ‌పెట్టారు. భారత ఐటీ కంపెనీలను నిరోధించడానికి ఉద్దేశించిన 2016 హెచ్-1బీ - ఎల్ 1 వీసా సంస్కరణ చట్టం బిల్లును కాలిఫోర్నియా - న్యూజెర్సీ రాష్ట్రాలకు చెందిన డెమొక్రాటిక్ పార్టీ నుంచి బిల్ పాస్ర్కెల్ - రిపబ్లికన్ సభ్యుడు డానా రోహ్రా బాచెర్ ఈ బిల్లును ప్రతిపాదించారు. ఈ బిల్లు ఆమోదం పొందితే హెచ్ 1 బీ - ఎల్ 1 వీసాల‌కు పెద్ద ఎత్తున కోత ప‌డుతుంది.

విదేశీ ఔట్ సోర్సింగ్ కంపెనీల ఉద్యోగులే టాప్ వినియోగదారులుగా ఉన్నారని - త‌ద్వారా అమెరికాలో నిరుద్యోగుల సంఖ్య పెరగడానికి కారణంగా మారుతోంద‌ని ఆ దేశంలో పలువురు ఆందోళ వ్య‌క్తం చేశారు. ఈ నేప‌థ్యంలో హెచ్-1బీ - ఎల్ 1 వీసాల విధానాన్ని కఠినతరం చేయాలంటూ సంయుక్త చట్టసభ సభ్యులు ప్ర‌తిపాదించారు. వీసా జారీ ప్రక్రియలోని లోపాలను సవరించాలని - తద్వారా అమెరికా ఉన్నత ఉద్యోగులకు - వీసా హోల్డర్ల హక్కులను కాపాడాలని కోరారు. అధికార - విపక్ష సభ్యులు హెచ్ 1 బీ - ఎల్ 1 సంస్కరణల బిల్లును సంయుక్తంగా ప్రవేశపెట్టడంతో ఈ బిల్లు ఆమోదం పొందుతుంద‌ని భావిస్తున్నారు. ఈ కొత్త బిల్లు ప్రకారం- ఏదైనా కంపెనీ తమ ఉద్యోగుల్లో 50 కంటే ఎక్కువ మందిని, లేదంటే మొత్తం ఉద్యోగుల్లో సగం కంటే ఎక్కువ మందిని హెచ్‌-1బీ - లేదా ఎల్‌-1 వీసాదారులతో భర్తీ చేసుకోవడం కుదరదు. ఈ నేప‌థ్యంలో అమెరికాలో అత్యధిక ఆదాయన్ని పొందుతున్న గుండెల్లో గుబులు మొదలైంది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆమోదముద్ర పడాలంటే ఈ బిల్లును సెనెట్ ఆమోదించాల్సి ఉంది.

ఇదిలాఉండగా...హెచ్ 1బీ - ఎల్1 వీసాల్లోని కొన్ని కేటగిరీల వీసాల ఫీజులను కొద్దికాలం క్రితమే అమెరికా భారీగా పెంచింది. డిసెంబర్ 18 - 2015 తర్వాత హెచ్1బీలోని కొన్ని కేటగిరీల వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నవాళ్లు అదనంగా ఒక్కో వీసాకు $4000 డాల‌ర్లు చెల్లించాలని యూఎస్ సిటిజన్‌ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్(యూఎస్‌ సీఐఎస్) స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు త‌న వెబ్‌ సైట్‌ లో ప్రకటించింది. అలాగే..ఎల్1ఏ - ఎల్2బీ దరఖాస్తుదారులు $4500 డాల‌ర్లు అదనంగా చెల్లించాలని స్పష్టం చేసింది. ఈ పెంపు సెప్టెంబర్ 30 - 2025 వరకు అమల్లో ఉంటుందని తెలిపింది.