Begin typing your search above and press return to search.

ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణపై బిల్ గేట్స్ కీలక వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   7 Oct 2020 5:35 PM GMT
ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణపై బిల్ గేట్స్ కీలక వ్యాఖ్యలు
X
కరోనా దెబ్బకు ప్రపంచదేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. జీడీపీ మైనస్ లలోకి జారిపోయింది. ఈ క్రమంలోనే ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలపై ప్రముఖ పారిశ్రామికవేత్త, మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిట్ గేట్స్ కీలక వ్యాఖ్యలు చేశారు.

కరోనా వ్యాక్సిన్ పై సమర్థవంతమైన వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చి.. దాని పంపిణీ సక్రమంగా జరిగితే ధనిక దేశాల ఆర్థిక వ్యవస్థలు 2021 చివరి నాటికి సాధారణ స్థితికి చేరుతాయని బిల్ గేట్స్ అంచనా వేశారు. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న వ్యాక్సిన్లు ఏ మేరకు పనిచేస్తాయన్నది ఇంకా తెలియదని అన్నారు.

వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక దాని ఉత్పత్తి, పంపిణీ పెద్ద సవాల్ గా మారే అవకాశం ఉందని బిల్ గేట్స్ అన్నారు. అమెరికన్లు టీకాలు తీసుకోవడానికి వెనుకాడుతారని.. దాన్ని అధిగమించాలని సూచించారు.

రష్యా, చైనా దేశాలు అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్లు ఇంకా మూడో దశ ప్రయోగాలకు చేరుకోలేదని.. ప్రామాణిక ఆధారాలు లేవన్నారు. ఈ టీకాలు అంతగా ఆకట్టు కోవచ్చన్నారు.

పశ్చిమ దేశాలకు చెందిన కంపెనీలు రష్యా, చైనా వ్యాక్సిన్లపై మూడో దశ ప్రయోగాలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. ఈ టీకాలు సమర్థమైనవని తేలితే రష్యా, చైనా వ్యాక్సిన్లకు ప్రపంచవ్యాప్తంగా గిరాకీ ఉండే అవకాశం ఉంటుందన్నారు.

ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా తో తలెత్తిన సంక్షోభాలను ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా ప్రభుత్వాలు బాగా ఎదుర్కొన్నాయని.. దేశ ఆరోగ్య, ఆర్థిక వ్యవస్థల్ని సమర్థంగా ముందుకు తీసుకెళ్లగలిగాయని బిల్ గేట్స్ అభిప్రాయపడ్డారు.