Begin typing your search above and press return to search.

ఇండియాపై బిల్​గేట్స్​ పొగడ్తల వర్షం.. కారణం అదేనా!

By:  Tupaki Desk   |   16 Sep 2020 2:30 AM GMT
ఇండియాపై బిల్​గేట్స్​ పొగడ్తల వర్షం.. కారణం అదేనా!
X
ఇండియాపై మైక్రోసాఫ్ట్​ సహ వ్యవస్థాపకుడు బిల్​గేట్స్​ పొగడ్తల వర్షం కురిపించాడు. వ్యాక్సిన్​ తయారీలో భారత్​ సహకారం ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఏడాది ప్రారంభం కాగానే వ్యాక్సిన్​లు తుది ప్రయోగదశకు చేరుకుంటాయని చెప్పారు. ఇండియాలో భారీ మొత్తంలో వ్యాక్సిన్లు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందన్నారు. భారతదేశంలో ఫార్మారంగం ఎంతో అభివృద్ధి చెందిందని.. ప్రపంచ దేశాలకు సరిపడా అక్కడ వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్నదని ఆయన పేర్కొన్నారు. బిల్​గేట్స్​ ప్రస్తుతం బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్ ట్రస్టీగా ఉన్నారు. వ్యాక్సిన్​ సురక్షితం అని తేలిన తర్వాతే మార్కెట్​లోకి తీసుకురావాలన్నది తన అభిప్రాయమని చెప్పారు.

భారత్​లో ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్​ ప్రపంచంలోని ఎన్నోదేశాలకు సరఫరా కానున్నదని చెప్పారు. తొందర్లోనే కరోనా పీడ విరగడై ప్రపంచ ఆర్థికవ్యవస్థ పుంజుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 38 వ్యాక్సిన్​లు మానవ ప్రయోగదశలో ఉన్నాయని... మరో 93 వ్యాక్సిన్లు ప్రీ క్లినికల్ ట్రయల్​ దశలో ఉన్నాయని చెప్పారు. కరోనా వైరస్​కు చెక్​పెట్టేందుకు ఇప్పటికే ప్రపంచంలోని పలు దేశాలు వ్యాక్సిన్ల క్లినికల్​ ట్రయల్స్​ నిర్వహిస్తారు. రష్యా ఇప్పటికే స్పుత్నిక్​-వీ అనే వ్యాక్సిన్​ను ఉత్పత్తి చేసి మార్కెట్​లోకి విడుదల చేసింది. నవంబర్​లో వ్యాక్సిన్​ అందుబాటులోకి తీసుకొస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ప్రకటించారు. మరోవైపు చైనా కూడా వ్యాక్సిన్​ తయారీలో ముందజలో ఉన్నది.