Begin typing your search above and press return to search.

ట్విట్టర్ పరిస్థితిపై సంచలన కామెంట్స్ చేసిన బిల్ గేట్స్..!

By:  Tupaki Desk   |   27 Dec 2022 4:05 AM GMT
ట్విట్టర్ పరిస్థితిపై సంచలన కామెంట్స్ చేసిన బిల్ గేట్స్..!
X
టెస్లా అధినేత ఎలన్ మస్క్ ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్నాక ఆ సంస్థలో జరుగుతున్న మార్పులపై మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎలన్ మస్క్ ఒంటెద్దు పోకడలకు పోకుండా సామాజిక మాధ్యమాల ద్వారా సమాజంలో ఉద్రిక్తలు కలగకుండా.. అసత్య ప్రచారాలను అడ్డుకోవాలని ఆయన సూచించారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.

ఎలన్ మస్క్ కొన్ని నెలల కిందట ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్నాడు. ప్రపంచంలోనే అత్యంత భారీ డీల్ గా ట్విట్టర్ కొనుగోలు వ్యవహరం నడిచింది. ట్విట్టర్ ను ఆదాయ వనరుగా మార్చే క్రమంలో ఎలన్ మస్క్ తనదైన సంస్కరణలను ఆ సంస్థలో చేపడుతున్నారు. ఇందులో భాగంగా ట్విట్టర్ సీఈవో సహా ఎనిమిది డైరెక్టర్లపై మొదట్లోనే వేటు వేశారు.

ఆ తర్వాత ఖర్చుల భారం తగ్గించుకునే క్రమంలో వేలాది మంది ఉద్యోగులను ఇంటికే పరిమితం చేశారు. ఈ వ్యవహరం కోర్టులకు వరకు వెళ్లింది. ఎలన్ మస్క్ చర్యలను ఉద్యోగులంతా మూకుమ్మడిగా ఖండిస్తూ ట్విట్టర్లో ట్విట్లు చేయడం అప్పట్లో వైరల్ గా మారింది. ఇదే క్రమంలో ట్విట్టర్ వినియోగదారులకు సైతం ఎలన్ మస్క్ షాకిచ్చాడు.

బ్లూ టిక్ వెరికేషన్ పేరిట 8 నుంచి 12 డాలర్ల వరకు ఛార్జ్ చేస్తున్నారు. గతంలో ట్విట్టర్ నిలిపివేసిన వైన్ యాప్ ను తిరిగి తీసుకురాన్నట్లు ప్రకటించారు. మరోవైపు సమాజంలోని పలు అంశాలు.. ట్విట్టర్లో చేపడుతున్న సంస్కరణలపై ఎలన్ మస్క్ ఎప్పటికప్పుడూ పోల్ నిర్వహిస్తూ నెటిజన్ల అభిప్రాయాలను సేకరిస్తున్నారు.

కాగా ట్విట్టర్ సీఈవోగా కొనసాగుతున్న తాను ఆ పదవీ నుంచి నిష్క్రమించాలా.. వద్దా అనే అంశం ఎలన్ మస్క పోల్ నిర్వహించగా ఖాతాదారులు ఆయనకే షాకిచ్చారు. ఈ సర్వేలో లక్షలాది మంది ట్విటర్ ఖాతాదారులు పాల్గొనగా 57.7శాతం మంది ఎలన్ మస్క్ కు వ్యతిరేకంగా ఓటు వేశారు.ఇక తన పోల్ లోనే తానే ఓడిపోవడంతో ఎలన్ మస్క్ ట్విట్టర్ సీఈవో పదవీ నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించారు.

ఈ క్రమంలోనే కొత్త ట్విట్టర్ సీఈవో ఎంపిక కోసం ఎలన్ మస్క్ కసరత్తులు చేస్తున్నారు. ఈక్రమంలోనే ఎలన్ మస్క్ చర్యలను బిల్ గేట్స్ తప్పుబట్టారు. కంపెనీకి సంబంధించిన విధానపరమైన నిర్ణయాలను తీసుకోవడంలో వ్యక్తిగత అభిప్రాయాలకు.. పోల్స్ ప్రాధాన్యం ఇవ్వకూడదని బిల్ గేట్స్ వివరించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.