Begin typing your search above and press return to search.

అమెరికా అతిపెద్ద భూస్వామి బిల్ గేట్స్

By:  Tupaki Desk   |   15 Jan 2021 3:09 PM IST
అమెరికా అతిపెద్ద భూస్వామి  బిల్ గేట్స్
X
మైక్రోసాఫ్ట్ యజమాని బిల్ గేట్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలోనే అత్యధిక మొత్తంలో వ్యవసాయ భూమి కలిగిన జాబితాలో తాజాగా బిల్ గేట్స్ అగ్రస్థానంలో నిలిచారు. దాదాపు 18 రాష్ట్రాల్లో ఆయన భారీస్థాయిలో ఫార్మ్ ల్యాండ్స్ కొన్నట్టు తేలింది.

ఈ క్రమంలోనే అమెరికాలోనే అతిపెద్ద భూస్వామిగా బిల్ గేట్స్ రికార్డ్ నెలకొల్పారు. ప్రపంచ కుబేరుల్లో ప్రస్తుతం బిల్ గేట్స్ నాలుగో స్థానంలో ఉన్నారు.

అమెరికా దేశ ల్యాండ్ రిపోర్ట్ ఆధారంగా బిల్ గేట్స్ వద్ద 2,42,000 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు రిపోర్ట్ లో పేర్కొన్నారు. బిల్ గేట్స్ భార్య మెలిండా గేట్స్ వద్ద 2,68,984 ఎకరాల భూమి ఉన్నట్లు రిపోర్టులో పేర్కొన్నారు. ఈ ఇద్దరి వద్ద ఉన్న భూమిలో ఎక్కువ శాతం వ్యవసాయ భూములే ఉన్నట్లు రిపోర్టులో వెల్లడించారు. మొత్తం లెక్కల్లో 25750 ఎకరాలు మాత్రం ట్రన్ షినల్ ల్యాండ్ కాగా.. 1234 ఎకరాల రిక్రియేషనల్ ల్యాండ్ గా గుర్తించారు.

ఫోర్బ్స్ జాబితా ప్రకారం.. బిల్ గేట్స్ ఆస్తి దాదాపు 121 బిలియన్ డాలర్లు. లూసియానాలో 69071 ఎకరాలు, ఆర్కాన్సాస్ లో 47927 ఎకరాలు, నెబ్రస్కాలో 20588 ఎకరాలు బిల్ గేట్స్ పేరుమీద ఉన్నాయి.

బిల్ గేట్స్ కు చెందిన కాస్ కేడ్ ఇన్వెస్ట్ మెంట్స్ పేరిట ఆ భూములు ఉన్నట్లు తేలింది. అమెరికాలో గేట్స్ తర్వాత అత్యధిక స్థాయిలో వ్యవసాయ భూములు కలిగి ఉన్న వారిలో అవుట్ ఫ్యామిలీ 190000 ఎకరాలు.. స్టీవర్ట్ అండ్ లిండా రెస్ నిక్ 190000 ఎకరాలు ఉన్నాయి.