Begin typing your search above and press return to search.

మనకంటే ఒబామాకే ఇంటికెళ్లే తొందర ఎక్కువా?

By:  Tupaki Desk   |   2 Oct 2016 12:01 PM IST
మనకంటే ఒబామాకే ఇంటికెళ్లే తొందర ఎక్కువా?
X
ఆఫీస్ కావొచ్చు.. స్నేహితులతో కలిసే సందర్భం కావొచ్చు.. ఇంకే వ్యవహారమైనా.. అనుకున్న సమయం మించుతుంటే.. ఇంటికెళ్లాల్సిన తొందర వెంటాడుతుంటుంది. అయితే.. దీన్ని పలువురు తప్పు పడుతూ ఉంటారు. అయితే..అదేమీ తప్పేం కాదని చెప్పటమే కాదు.. అలాంటి తీరు సామాన్యులకే కాదు.. అసమాన్యులకు కూడా ఎక్కువేనన్న ఉదంతం తాజాగా చోటు చేసుకుంది. ఇల్లు ఎవరికైనా ఇల్లేనని చెప్పే ఘటన తాజాగా చోటు చేసుకోవటమే కాదు.. ప్రపంచం దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. ఇంటికి వెళ్లే విషయంలో మనలాంటి వారికి ఎలాంటి తొందర ఉంటుందో..సేమ్ టు సేమ్ ఇదే పరిస్థితి ప్రపంచ పెద్దన్న అమెరికా అధ్యక్షుడికి కూడా ఉంటుందని తేలిపోయినట్లే. అదెలానంటారా?

ఇజ్రాయెల్ నేత షిమోన్ పెరెజ్ మరణించిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలకు అమెరికా అధ్యక్షుడు ఒబామాతో పాటు.. పలుదేశాల అధినేతలు హాజరయ్యారు. ఒబామాతో పాటు.. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ కూడా హాజరయ్యారు. అంత్యక్రియల అనంతరం తిరిగి తన దేశానికి బయలుదేరారు ఒబామా. జెరూసలెం నుంచి తిరిగివెళ్లే క్రమంలో ఎయిర్ పోర్ట్ లోని ఎయిర్ ఫోర్స్ వన్ లోకి వెళ్లిపోయారు ఒబామా. ఆయనతోనే ఉన్న క్లింటన్.. ఒబామాతో పాటు విమానంలోకి వెళ్లకుండా..కిందన మరొకరితో మాట్లాడుతూ ఉండిపోయారు.

కొద్దిసేపు వెయిట్ చేసిన ఒబామా.. విమానం నుంచి బయటకు వచ్చి.. కేకలేస్తూ.. చప్పట్లు కొడుతూ.. క్లింటన్ ను పిలిచే ప్రయత్నం చేశారు. అయితే.. ఫ్లైట్ సౌండ్ లో ఒబామా కేకలు బిల్ క్లింటన్ కు వినిపించలేదు. దీంతో.. ఒబామా కాస్త ముందుకు వచ్చి.. బిల్ పద వెళ్దాం.. నేను ఇంటికి వెళ్లాల్సి ఉందంటూ కేక వేశారు. దీంతో రియాక్ట్ అయిన క్లింటన్.. విమానంలోకి వచ్చి ఒబామాతో చేతులు కలిపి లోపలకు వెళ్లారు. ఈ ఘటన పలువురి దృష్టిని విపరీతంగా ఆకర్షించింది. సో.. ఇంటికి వెళ్లాలని అనుకోవటం తప్పేం కాదండోయ్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/