Begin typing your search above and press return to search.

భార్యతో విడిపోయాక.. బిల్​గేట్స్​ ఎలా గడుపుతున్నాడంటే?

By:  Tupaki Desk   |   14 May 2021 11:30 PM GMT
భార్యతో విడిపోయాక.. బిల్​గేట్స్​ ఎలా గడుపుతున్నాడంటే?
X
ప్రపంచ కుబేరుల్లో ఒకరు, మైక్రోసాఫ్ట్​ వ్యవస్థాపకుడు బిల్​గేట్స్​ దినచర్య ఎలా ఉంటుంది? రోజు ఆయన తింటాడు? ఏం చేస్తాడు? ఎలా రోజంతా గడుపుతారు? సహజంగానే అందరికీ ఈ సందేహం వస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే ఇటీవల బిల్​గేట్స్​ తన భార్యమెలిండా గేట్స్‌తో విడిపోయారు. వ్యక్తిగత కారణాలతో భార్యభర్తలిద్దరూ పరస్పర అంగీకారంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.ఇదిలా ఉంటే భార్యతో విడిపోయాక బిల్​గేట్స్ రోజువారి జీవితం ఎలా ఉంది? అన్న విషయంపై ప్రపంచవ్యాప్తంగా అందరిలోనూ ఆసక్తి నెలకొన్నదట. అందుకే గూగుల్​ తల్లిని అందరూ ఇదే విషయాన్ని అడుగుతున్నారట.

మరి బిల్​గేట్స్​ ఇప్పుడు ఎక్కడున్నారు? ఆయన దినచర్య ఎలా ఉంది? తదితర విషయాలను మనమూ తెలుసుకుందాం.. ప్రస్తుతం బిల్​గేట్స్​ వాషింగ్టన్‌లోని మదీనాలో నివాసం ఉంటున్నారు. ఆయన ఉంటున్న భవంతి సువిశాలమైంది. సుమారు 66 వేల చదరపు అడుగుల్లో ఈ భవంతిని నిర్మించారు. ప్రస్తుతం బిల్​గేట్స్​ తన కూతురుతో కలిసి ఇక్కడే ఉంటున్నారు. అయితే ఆయన ఎక్కువగా పుస్తకాలు చదువుతూ గడుపుతున్నారట. ఈ ఇల్లు పసిఫిక్ లాడ్జ్ తరహాలో నిర్మించారు. ఈ ఇంటిని నిర్మించేందుకు ఏడేళ్లు పట్టిందట. సుమారు 300 మంది కార్మికులు ఈ ఇంటి నిర్మాణం కోసం శ్రమించారట. ప్రస్తుతం ఇక్కడ 100 మందికి పైగా ఎలక్ట్రీషియన్లు ఉన్నారు. అంతేకాక చాలా మంది వర్కర్స్​ కూడా ఉంటారు.

బిల్ గేట్స్ ఉదయాన్నే.. బ్రేక్​ ఫాస్ట్​గా కోకో పఫ్స్ తీసుకుంటారు. లంచ్​లో జున్ను బర్గర్ తినడం ఇష్టపడతారు. ఇక డిన్నర్​లో కూడా తేలికపాటి ఆహారాన్నే తీసుకుంటారు. రోజంతా యాక్టివ్​గా ఉండేందుకు ఆయన కొన్ని ప్రత్యేకమైన వ్యాయామాలు చేస్తుంటారట. అంతేకాక ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో తెలుసుకోవాడనికి నిత్యం అప్​డేట్స్​ తెలుసుకుంటూ ఉంటారట. అప్పడప్పుడు వాకింగ్ చేస్తుంటారట. ఇక టెన్నిస్​ ఆడటం కూడా బిల్​గేట్స్​కు ఎంతో ఇష్టమట.