Begin typing your search above and press return to search.
బీహార్ లో నిప్పుపై నిషేధం
By: Tupaki Desk | 30 April 2016 4:50 PM ISTబీహార్ లో మద్య నిషేధం ఇప్పటికే దేశం దృష్టిని ఆకర్షిస్తుండగా తాజాగా ఆ రాష్ట్రంలో మరో నిషేధం మొదలైంది. అది ఏకంగా ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. వాతావరణ మార్పులు... భూమిపై రోజురోజుకూ పెరిగిపోతున్న వేడి ప్రభావం ఏ స్థాయిలో ఉంది.. ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నదానికి ఉదాహరణగా బీహార్ నిలిచింది. ఇప్పటికే వాతావరణం పొడిబారిపోయి అగ్నిప్రమాదాలు అధికమవుతుండడంతో బీహార్ ప్రభుత్వం నిప్పుపై నిషేధం విధించింది. ఉదయం 9నుంచి సాయంత్రం 5గంటల వరకు నిప్పు రాజేసేందుకు వీల్లేదంటూ ఉత్తర్వులు జారీ చేసింది. వంటలు వండుకునేందుక్కూ డా అవకాశం లేదని తేల్చేంది.
ఏమాత్రం నిప్పు కణిక పొరపాటున రాజుకున్నా అది ఊళ్ళకు ఊళ్ళను చుట్టబెట్టేస్తుంది. గాలిలో తేమ మొత్తం తడారిపోవడంతో నిప్పు మరింత వేగంగా విస్తరిస్తోంది. ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకూడదన్న ముందస్తు జాగ్రత్తతో బీహార్ ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. అడపాదడపా కొన్ని దేశాల్లో ఇలాంటి చర్యలు తీసుకున్నా అవి కొన్ని ప్రాంతాలకే పరిమితమవుతున్నాయి. బీహార్లో మాత్రం రాష్టవ్యాప్తంగా పగటి పూట నిప్పును నిషేధించి అమలు చేస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు దుష్ప్రభావాలు చూపిస్తుండడంతో ఆ పరిణామాలను ఎదుర్కొనే దిశగా బీహార్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ప్రశంసలు అందుతున్నా అదేసమయంలో దానివల్ల గ్రామీణ ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.