Begin typing your search above and press return to search.
బీహార్ లో గెలుపు ఎవరో చెప్పిన తాజా సర్వే
By: Tupaki Desk | 14 Oct 2020 2:20 PM ISTదేశవ్యాప్తంగా ఇప్పడు అందరి కళ్ళు బిహార్ వైపే. ఎందుకంటే కరోనా లాంటి మహమ్మారి దాడి తర్వాత దేశంలో ప్రధాని మోడీ తీరుపై తీవ్ర విమర్శలు చెలరేగిన వేళ జరుగుతున్న తొలి పెద్ద ఎన్నికలు కావడంతో దేశమంతా ఉత్కంఠ నెలకొంది.
ఈ రాష్ట్రంలో బీజేపీ-జేడీయూ పొత్తు పెట్టుకొని సీఎంగా మరోసారి నితీష్ ను బరిలోకి దింపారు. మరోసారి ఈ కూటమి గెలవాలని బీజేపీ భావిస్తోంది. అయితే బిహార్ వలస కూలీలు కరోనా టైంలో ఎంత కష్టపడ్డారో.? ఎలా రాష్ట్రాల నుంచి నడిచి వచ్చారో తీవ్ర వర్ణనాతీతంగా ఉంది. ఇక కరోనా టైంలో నితీష్ సర్కార్ సరిగా ప్రజలు, కూలీలను ఆదుకోలేదనే అపవాదును మూటగట్టుకుంది. ఇక కేంద్రంలోని బీజేపీపై తీవ్ర ఆగ్రహంగా ఓటర్లు ఉన్నారు. ప్రతిపక్ష ఆర్జేడీ-కాంగ్రెస్ కు ఇవే ఆయుధాలుగా ఉన్నాయి.
తాజాగా టైమ్స్ నౌ-సీఓటర్ సర్వేను నిర్వహించారు. ఇందులో ఆసక్తికర ఫలితాలు వెల్లడయ్యాయి. బీహార్ లో ఈసారి మరోసారి ఎన్డీఏ కూటమిదే గెలుపు అని సీఓటర్ సర్వే తేల్చింది. అయితే ఈ సర్వేలో బిహార్ లో పెద్ద పార్టీ అయిన జేడీయూ కంటే బీజేపీకే ఎక్కువ సీట్లు సొంతం చేసుకునే వీలుందని సర్వేలో తేలింది. దీనిప్రకారం.. బీజేపీ అభ్యర్థి సీఎం క్యాండిడేట్ అవుతారా అన్న అనుమానాలు అక్కడ వ్యక్తమవుతున్నాయి. నితీష్ ను సీఎంగా బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తే ఒప్పుకుంటుందా లేదా అన్నది వేచిచూడాలి.
సీఓటర్ సర్వేలో 243 అసెంబ్లీ సీట్లున్న బీహార్ అసెంబ్లీలో 160 స్థానాల్లో ఎన్డీఏ కూటమి గెలుస్తుందని తేలింది. ఇక ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి 75 స్థానాల్లో గెలుస్తుందని అంచనావేసింది.
* సర్వే ప్రకారం.. బీజేపీ 121 స్థానాల్లో పోటీచేసి 84 స్థానాల్లో విజయం సాధిస్తే.. 122 స్థానాల్లో పోటీచేస్తున్న జేడీయూ కేవలం 70 సీట్లలోనే గెలుస్తుందని సర్వే తేల్చింది.
*ఇక ఎన్డీఏలో మిగిలిన పార్టీలకు ఆరు సీట్లు మాత్రమే వస్తాయని సర్వే తెలిపింది.
*ఇక ఆర్జేడీకి 56 సీట్లకు మించి రావని సర్వేలో తేలింది. దాని మిత్రపక్షం కాంగ్రెస్ 15 సీట్లు రావడం కష్టమని తేల్చింది.
*ఇక ఎన్డీఏ నుంచి వైదొలగిచిన ఎల్.జేపీకి ఐదు స్తానాలు మించి రావని అంచనా వేసింది. అయితే జేడీయూ అవకాశాలను ఎల్.జే.పీ దెబ్బతీస్తోందని సర్వే తెలిపింది.
తాజా సర్వే ఫలితాలు బీజేపీకి ఉత్సాహాన్ని ఇస్తుండగా అధికార జేడీయూను మాత్రం కొంత ఆందోళనకు గురిచేస్తోంది.