Begin typing your search above and press return to search.

బీహార్ రాజకీయాల్లో క్షుద్రపూజల కలకలం..ఆలయాల చుట్టూ హామీల వర్షం!

By:  Tupaki Desk   |   26 Oct 2020 1:00 PM IST
బీహార్ రాజకీయాల్లో క్షుద్రపూజల కలకలం..ఆలయాల చుట్టూ హామీల వర్షం!
X
దేశం మొత్తం ఇప్పుడు బీహార్ వైపు చూస్తుంది. పోలింగ్ సమయం దగ్గర పడేకొద్ది ఓటర్లను ఆకర్షించడానికి అన్ని పార్టీల నేతలు వ్యూహ , ప్రతి వ్యూహాలతో వేగంగా ముందుకు కదులుతున్నారు. దీనితో బీహార్ రాజకీయం రణరంగాన్ని తలపిస్తుంది. అలాగే ఎన్నికల ప్రచార సభలో ఓ ఎమ్మెల్యే అభ్యర్థిని దుండగులు కాల్చి చంపడం కలకలం రేపింది. బీహార్ ‌లో ఈనెల 28న తొలివిడత పోలింగ్‌ జరగనుంది. దీంతో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని మరింత వేగవంతం చేశాయి. అయితే , ఈ ఎన్నికల ప్రచారం మళ్లీ ఆలయాల చుట్టూ తిరుగుతోంది. లోక్‌జనశక్తి పార్టీ సీతమ్మ తల్లికి గుడి కడతామనే నినాదాన్ని తీసుకొచ్చింది. అయోధ్యలో నిర్మితమౌతోన్న రామమందిరానికి మించిన స్థాయిలో సీతమ్మ తల్లికి ఆలయాన్ని కట్టడానికి ప్రణాళికలను రూపొందిస్తామంటున్నారు.

లోక్‌జనశక్తి పార్టీ అధినేత చిరాగ్ పాశ్వాన్. అంతేకాదు నితీష్ ‌ను జైలుకు పంపతామని సంచలన కామెంట్స్‌ చేశారు. మరోవైపు మంత్రాలు, చేతబడి వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.తనను చంపడానికి లాలూ ప్రసాద్ యాదవ్ తాంత్రిక పూజలు చేశారంటూ సీనియర్ బీజేపీ నేత, బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీ ఆరోప[ఆరోపణలు చేస్తున్నారు. అయితే, ఈ వ్యాఖ్యల పై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ మండిపడ్డారు. సుశీల్ మోడీ ఇంతలా దిగజారి మాట్లాడుతారని అనుకోలేదని అన్నారు.

జేపీ ఓటర్లు తీవ్ర గందరగోళంలో ఉన్నారు. ఎన్టీయే కూటమి నుంచి తప్పుకుని సొంతంగా పోటీ చేస్తున్నప్పటికీ, ఇప్పటికీ బీజేపీ మిత్రపక్షమే అన్నట్లుగా వ్యవహరిస్తోంది లోక్ జనశక్తి పార్టీ. జేడీయూ అధినేత నితీశ్‌కు చెక్ పెట్టేందుకు బీజేపీయే ఎల్‌ జేపీని బీ టీమ్‌ గా బరిలో దింపిందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ప్రచారం జరుగుతుండగానే జనతాదళ్ రాష్ట్రవాది అభ్యర్థి ఎమ్మెల్యే అభ్యర్థి నారాయణ్ సింగ్ ను దుండగులు కాల్చి చంపడం కలకలం రేపింది. మొత్తంగా బీహార్ రాజకీయం రోజురోజుకి వేడెక్కిపోతుంది. చూడాలి మరి ఈ వేడిలో ఎవరు బయటపడతారో ..ఎవరు కాలిపోతారో .