Begin typing your search above and press return to search.
అభ్యర్ధుల్లో ఎంతమందిపై క్రిమినల్ కేసులున్నాయో తెలుసా ?
By: Tupaki Desk | 21 Oct 2020 11:15 AM ISTఒకవైపు నేరచరితులు చట్టసభల్లో అడుగుపెట్టకూడదని సుప్రింకోర్టు మొత్తుకుంటోంది. ఇదే సమయంలో దాదాపు అన్నీ పార్టీలూ ఎన్నికల్లో నేరచరితులకే టికెట్లు ఇస్తున్నాయి. మరి గెలిచిన అభ్యర్ధేకాదు ఓడిపోయిన అభ్యర్ధులకు కూడా నేరచరిత్రున్ వాళ్ళే అయితే ఎవరైనా చేసేదేముంటుంది? తొందరలో జరగబోయే బీహార్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధుల నేపధ్యం చూస్తే ఈ విషయం అర్ధమైపోతుంది.
బీహార్ ఎన్నికల్లో తొలదశలో పోటీ చేస్తున్న వారిలో 31 శాతంమందిపై చాలా కేసులున్నాయట. అసోసియేషన్ ఫర్ డమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడిఆర్) విడుదల చేసిన వివరాలు చూస్తే ఎవరికైనా కళ్ళు తిరగాల్సిందే. 243 సీట్లున్న అసెంబ్లీకి తొలదశలో అంటే ఈ నెల 28వ తేదీన 71 స్ధానాలకు పోలింగ్ జరగబోతోంది. ఈ సీట్లలో విజయం కోసం 1066 మంది పోటి చేస్తున్నారు. వీరిలో 244 మందిపైన తీవ్రమైన నేరాభియోగాలున్నట్లు స్పష్టంగా అర్ధమవుతోంది. 1066 మంది ఎలక్షన్ కమీషన్ కు సమర్పించిన అఫిడవిట్లలోనే ఈ విషయాలు బయటపడ్డాయి.
ఆర్జేడీ నుండి పోటీ చేస్తున్న అభ్యర్ధుల్లో 52 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. వీరిలో 30 మంది ఓ మాదిరి క్రిమినల్ కేసులుంటే మరో 22 మందిపైన తీవ్రమైన క్రిమినల్ కేసులున్నాయట. వీళ్ళ తర్వాత బీజేపీ, ఎల్జేపీ, కాంగ్రెస్ అభ్యర్ధులు కూడా తక్కువేమీ తినలేదు. 244 మందిలో 64 మందిపైన హత్యాయత్నాలు, హత్యలు, అత్యాచార కేసులను ఎదుర్కొంటున్నవాళ్ళున్నారు. ఇవన్నీ ఆరోపణలు కావు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లే అంటే నమ్మకతప్పటం లేదు.
మరి ఎన్నికల్లో ఇంతమంది నేరచరితులు పోటి చేస్తున్నపుడు వీరిలో సగమందైనా గెలిస్తే చట్టసభల పరువు ఏమి కావాలి ? ఈ సంఖ్య తొలిదశలో పోటి చేసే వాళ్ళదే. రెండోదశ, మూడోదశలో పోటీ చేసే వాళ్ళ నామినేషన్లు ఇంకా జరగలేదు. అప్పుడు మిగిలిన వాళ్ళ జాతాలు కూడా బయటపడతాయి. వరస చూస్తుంటే 243 అసెంబ్లీ సీట్లలో కనీసం 100 మందైనా గెలిచే అవకాశాలున్నట్లే అర్ధమవుతోంది. ఎందుకంటే ప్రతిపార్టీలోను నేరచరితులు పోటీ చేస్తున్నారు కాబట్టే. అసెంబ్లీ ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చిన తర్వాతే ఎంతమంది నేరచరితులు గెలిచింది స్పష్టమవుతుంది.