Begin typing your search above and press return to search.

ఎన్నికల తాయిలాలు: ఇంటర్ పాసైతే 25వేలు, డిగ్రీకి రూ.50వేలు

By:  Tupaki Desk   |   26 Sept 2020 9:15 AM IST
ఎన్నికల తాయిలాలు: ఇంటర్ పాసైతే 25వేలు, డిగ్రీకి రూ.50వేలు
X
ఎలాగైనా గెలవాలి.. అందుకోసం ప్రజలను ఆకర్షించాలి. దాంతో పాటు ఓట్లను కొల్లగొట్టాలి. ఈ మంత్రం జపిస్తూ ఇప్పుడు రాజకీయ పార్టీలు ముందుకెళుతున్నాయి. అందుకే గెలుపు కోసం అలివి కాని హామీలు ఇస్తున్నాయి.

తాజాగా బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ నగారా మోగించింది. ఈ క్రమంలోనే అక్కడి రాజకీయ పార్టీలు హామీల వరద కురిపిస్తున్నాయి. తాజాగా మూడోసారి హ్యాట్రిక్ కొట్టాలని యోచిస్తున్న నితీష్ కుమార్ ఏకంగా ప్రజలపై బ్రహ్మాస్త్రాన్ని వదిలారు.

గత ఎన్నికల్లో సంపూర్ణ మధ్యపాన నిషేధం అమలుచేసిన బీహార్ సీఎం నితీష్ మహిళల ఓట్లను గంపగుత్తగా పొందారు. తాజాగా యువతరం మనసు దోచే ఆఫర్ ప్రకటించారు.

ఇంటర్మీడియెట్ ప్రథమ శ్రేణిలో పాసైన బాలికలకు రూ.25వేలు.. డిగ్రీ పాసైన అమ్మాయిలకు రూ.50వేలు అందజేయనున్నట్లు నితీష్ ఎన్నికల హామీని ప్రకటించారు.

ఇక నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత ప్రోత్సాహానికి ఒక కొత్త శాఖను ఏర్పాటు చేస్తామని సీఎం నితీష్ కుమార్ స్పష్టం చేశారు. కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునే వారికి ఆర్థిక సాయం చేస్తామని తెలిపారు.

బీహార్ లో మూడు దశల్లో పోలింగ్ జరుగుతుంది. మొత్తం 243 నియోజకవర్గాలకు అక్టోబర్ 28న తొలి విడత పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 3న రెండో విడత, నవంబర్ 7న మూడో విడత పోలింగ్ జరుగనుంది. నవంబర్ 10న ఫలితాలు వెల్లడిస్తారు.