Begin typing your search above and press return to search.

పెద్దోళ్ల అప్పుల గొప్పలు ఎంతంటే..?

By:  Tupaki Desk   |   21 Dec 2015 4:23 AM GMT
పెద్దోళ్ల అప్పుల గొప్పలు ఎంతంటే..?
X
పెద్దోళ్లు.. పెధ్దోళ్లే. వారు ఏం చేసినా ఘనంగానే ఉంటుంది. చివరకు అప్పులు చేసినా భారీగానే ఉంటుంది. బ్యాంకుల వద్ద నుంచి భారీ మొత్తంలో అప్పులు తీసుకొని.. వాటిని సకాలంలో చెల్లించటం సంగతి తర్వాత.. ఎగవేత దారులుగా ముద్ర వేసుకొని కూడా అత్యున్నత పదవుల్లో కొనసాగటం విశేషం. ఉదాహరణకు కేంద్రమంత్రి సుజనా చౌదరి సంగతి తీసుకుందాం. అయ్యగారు అంత పెద్ద స్థాయిలో ఉన్నారు. అదే సమయంలో ఆయనకు చెందిన కంపెనీ సుజనా యూనివర్సల్ ఇండస్ట్రీస్ బ్యాంకుల వద్ద తీసుకొని చెల్లించని మొత్తం రూ.330 కోట్లు. నిత్యం హాట్ హాట్ వార్తలు అందిస్తూ ప్రజల్ని చైతన్యపరిచినట్లుగా చెప్పుకునే దక్కన్ క్రానికల్ అప్పుల యవ్వారం తెలిసిందే. అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం.. దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ బకాయిల మొత్తం అక్షరాల వెయ్యికోట్ల రూపాయిలుగా చెబుతారు. డీసీకి చెందిన ప్రమోటర్ తిక్కవరపు వెంకట్రామ్ రెడ్డి మీద ఇప్పటికే బ్యాంకులు.. ఆర్థిక సంస్థలు పలు కేసులు నమోదు చేశాయి.

దేశంలో ప్రముఖ కంపెనీలుగా చెలామణీ అయ్యే కంపెనీలు బ్యాంకుల వద్ద భారీగా అప్పులు చేశాయి. కార్పొరేట్ రుణాలు తీసుకున్న పెద్ద కంపెనీలు తీసుకున్న అప్పుల విలువ చెబితే కళ్లు చెదిరిపోవాల్సిందే. ఎందుకంటే.. వీటి విలువ ఆ స్థాయిలో ఉంటుంది. దేశంలోని బ్యాంకులు రుణాలిచ్చిన మొత్తం అప్పుల్లో 27 శాతం కేవలం పది కంపెనీలే ఉండటం గమనార్హం. అంతర్జాతీయ ఫెనాన్షియల్ సర్వీసుల సంస్థ క్రెడిట్ స్విస్ ప్రకటించిన నివేదిక ప్రకారం.. పది బడా కంపెనీలకు బ్యాంకులు ఇచ్చిన అప్పు ఏకంగా రూ.3.12లక్షల కోట్లు. ఇక.. ఆ పది కంపెనీలు చూస్తే.. లాంకో.. జేపీ.. జీఎంఆర్.. వీడియోకాన్.. జీవీకే.. ఎస్సార్.. ఆదానీ.. రిలయన్స్.. జేఎస్ డబ్ల్యూ.. వేదాంత గ్రూపులు ఉన్నాయి.

ఇక.. బ్యాంకుల వద్ద భారీగా అప్పులు చేసి.. వాటిని తిరిగి చెల్లించకుండా ఉన్న పెద్దల పేర్లు చూస్తే విస్మయానికి గురి కావాల్సిందే. నిత్యం మీడియాలో సెలబ్రిటీలుగా కనిపించే పలువురు.. బ్యాంకులకు డిఫాల్టర్లుగా ఉండటం కనిపిస్తుంది. అలా బ్యాంకులకు బకాయిదారులుగా ఉన్న ప్రముఖలు.. కంపెనీలు చూస్తే..

కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ రూ.2673కోట్లు

విన్ సమ్ డైమండ్ జువెలర్స్ రూ.2660కోట్లు

ఎలక్ట్రోథెర్మ్ ఇండియా రూ.2211కోట్లు

జూమ్ డెవలపర్స్ రూ.1810కోట్లు

స్టెర్లింగ్ బయోటెక్ రూ.1732కోట్లు

ఎస్ కార్స్ నేషన్ వైడ్ రూ.1692కోట్లు

ఆర్చిడ్ కెమికల్స్ రూ.938కోట్లు

జైలాగ్ సిస్టమ్స్ రూ.715కోట్లు

దక్కన్ క్రానికల్ హోల్డింగ్స్ రూ.700కోట్లు

కేఎస్ ఆయిల్ రిసోర్సెస్ రూ.678కోట్లు

ఐసీఎస్ఏ రూ.646కోట్లు

మోసర్ బేర్ ఇండియా రూ.581కోట్లు

లాంకో హోస్కోటే హైవే రూ.533కోట్లు

హెచ్ డీఐఎల్ రూ.526కోట్లు