Begin typing your search above and press return to search.

సోనియా మెడకు మరో అగస్టా

By:  Tupaki Desk   |   14 May 2016 8:00 AM GMT
సోనియా మెడకు మరో అగస్టా
X
అగస్టా వెస్టుల్యాండ్ వీవీఐపీ ఛాపర్ల కేసు దేశాన్ని ఏ రేంజిలో ఊపేసిందో తెలిసిందే కదా. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ నుంచి ఆ పార్టీ మిగతా నేతలు ఆ దెబ్బకు వడదెబ్బకు గురయినట్లు గిలగిలా కొట్టుకున్నారు. అయితే... అగస్టాను మించిన కుంభకోణమొకటి బయటపడుతోంది. ఇది కూడా యూపీఏ ప్రభుత్వ హయాంలోనే జరగడం గమనార్హం.

కాంగ్రెస్ నేతృత్వంలోని గత యూపీఏ ప్రభుత్వం హయాంలో భారత నేవీ రెండు యుద్ధ నౌకలను తయారుచేయాలనుకుంది. ఐఎన్ ఎస్ దీపక్ - శక్తి పేరుతో నిర్మించడానికి 2009లో టెండర్లు పిలిచింది. దీనికి రష్యా - కొరియా - ఇటలీల నుంచి స్పందన వచ్చింది. ఆ మూడు దేశాల కెంపెనీలు టెండర్లు వేశాయి.

అయితే.. రష్యా సంస్థ ప్రమాణాల ప్రకారం మిలటరీ గ్రేడ్ ఉక్కుతో నిర్మిస్తామని చెప్పి కోట్ చేసింది. కానీ, యూపీఏ దానికి అంగీకరించలేదు.. అంత అవసరం లేదని చెప్పడంతో రష్యా సంస్థ బిడ్ నుంచి తప్పుకుంది. ఆ తరువాత ఆ నౌకా నిర్మాణ టెండర్ ఇటలీ సంస్థ ఫిన్ కేంటియెరీకి దక్కింది. లోపలి భాగం ఉక్కుతో ఉండేలా వాటిని నిర్మించారు. అయితే.. ఈ మొత్తం వ్యవహారాన్ని ఇటీవల నేవీ అదికారి ఒకరు బయటపెట్టారు. దీంతో రక్షణ మంత్రి మనోహర్ పారికర్ విచారణకు ఆదేశించారు.

సోనియా గాంధీ పుట్టిన దేశం ఇటలీకి చెందిన సంస్థకు కట్టబెట్టేందుకు రష్యా సంస్థను బయటకు పంపించడం వంటివన్నీ ఈ కుంభకోణంలో అనుమానాస్పదంగా ఉన్నాయని రక్షణ నిపుణులు - పరిశీలకులు అంటున్నారు. ఇది భారీ కుంభకోణమని చెబుతున్నారు. సో... సోనియా - కాంగ్రెస్ ల మెడకు మరో కుంభకోణం చుట్టుకోబోతుందన్నమాట.