Begin typing your search above and press return to search.

మీరు బార్లకు.. నేను పబ్బుకు.. విలేకరులపై రాహుల్ పంచ్

By:  Tupaki Desk   |   6 March 2020 10:03 AM IST
మీరు బార్లకు.. నేను పబ్బుకు.. విలేకరులపై రాహుల్ పంచ్
X
బిగ్ బాస్ 3 విజేత, ప్రముఖ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పై హైదరాబాద్ లోని ఓ బార్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోదరుడు దాడి చేయడం కలకలం రేపింది. రాహుల్ పై బీరు సీసాలతో దాడి చేసిన వీడియో బయటకు రావడంతో సంచలనమైంది. ఆ వీడియో వైరల్ గా మారింది. రాహుల్ కు ఏమైందన్న ఆందోళన ఆయన అభిమానుల్లో పెరిగి పోయింది.

ఈ ఊహాగానాలకు తెరదించుతూ రాహుల్ బయటకు వచ్చాడు. పెద్ద గాయాలు ఏమీ లేవు. కొన్ని చిన్న గాయాలు కనిపించాయి. అసలు గొడవకు గల కారణాలు వెల్లడించాడు.

తన స్నేహితులను ఉద్దేశించి చీప్ కామెంట్లు చేసిన వాళ్లతో తనకు గొడవ జరిగిందని.. వాళ్లకు పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉందని తెలుసని.. అయినా న్యాయం జరుగుతుందని పోలీసులకు ఫిర్యాదు చేశానని రాహుల్ మీడియా ఎదుట తెలిపారు.

ఈ సందర్భంగా విలేకరుల పై రాహుల్ శివాలెత్తాడు. ‘మీరు పబ్బుకు తరుచుగా వెళ్తారా? అని ప్రశ్నించగానే సదురు విలేకరిపై రాహుల్ విరుచుకుపడ్డాడు. ‘నేను మనిషినే కదా.. పబ్బుకు ఎంజాయ్ మెంట్ కోసం పోతే తప్పా? మీరు బార్లకు పోతరు.. నేను పబ్బుకు పోతా.. ’ అంటూ విలేకరులపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై విలేకరులు సీరియస్ గా కాగా రాహుల్ సారీ చెప్పాడు. విలేకరుల పై రాహుల్ వ్యాఖ్యలు దుమారం రేపాయి.