Begin typing your search above and press return to search.

స్వదేశీ నినాదం.. దిగుమతులపై నిషేధం.. మోడీకి సాధ్యమేనా?

By:  Tupaki Desk   |   3 Jun 2020 5:30 PM GMT
స్వదేశీ నినాదం.. దిగుమతులపై నిషేధం.. మోడీకి సాధ్యమేనా?
X
కరోనా-లాక్ డౌన్ తో దేశ ఆర్తిక వ్యవస్థ కుప్పకూలింది. జనాలంతా ఇంటికే పరిమితిమై.. కోట్ల మంది ఉద్యోగాలు పోయి ఉపాధి లేక అలమటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్రమోడీ ‘స్వదేశీ’ నినాదం ఇచ్చారు. స్వదేశీ పరిశ్రమకు ఊతం ఇవ్వాలని.. విదేశీ వస్తువులు తగ్గించాలని ప్రజలకు పిలుపునిచ్చాడు. అయితే ఈ నినాదం.. ప్రభుత్వ ప్రోత్సాహం స్వదేశీ పరిశ్రమలకు అందడం లేదని నిపుణులు ఆరోపిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ‘మేకిన్ ఇండియా’ను ప్రవేశపెట్టింది. ఇప్పుడు దాన్నే బలోపేతం చేస్తోంది. ఈ క్రమంలోనే అనవసర దిగుమతులను దేశంలోకి తగ్గించాలని డిసైడ్ అయ్యింది. సెల్ ఫోన్లు, బంగారు ఆభరణాలు, వజ్రాలు, ఎలక్ట్రానిక్స్, టెక్స్ టైల్స్ అండ్ గార్మెంట్స్ వంటి వాటి దిగుమతులను నిషేధించాలని యోచిస్తోందట.. ఇవన్నీ విడిభాగాలుగా ఇండియాకు వచ్చి ఇక్కడే అసెంబుల్ చేస్తున్నారు. దీని వల్ల మన దేశం ఇతరదేశాలపై ఆధారపడుతోంది.

ఇప్పటిదాకా ఈ ఉత్పత్తుల మెరుగైన పరిశ్రమలు భారత్ లో లేవు. అంత నాణ్యమైన విదేశీ వస్తువులలాగా మన తయారీ లేదు. దీంతో నాసిరకం వస్తువులను దేశ ప్రజలకు అంటగడితే వినియోగదారుల నుంచి విమర్శలు రావడం ఖాయం.. పైగా దిగుమతులు నిషేధిస్తే ఆయా దేశాలు కూడా మన ఎగుమతులను నిషేధిస్తాయి.. దాని వల్ల ఎలక్ట్రానిక్స్ ఎక్కువగా జపాన్, తైవాన్ లాంటి దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. ఆ దేశాల నుంచి మనకు ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంటుంది.

స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను మోడీ ప్రభుత్వం ఉల్లంఘించే అవకాశాలు కనిపించడం లేదు. అదే సమయంలో భారత్ లో నాణ్యమైన వస్తువుల ఉత్పత్తిని పెంచాలని యోచిస్తోందట.. దీంతో దిగుమతులపై దశల వారీగా నిషేధం విధించాలని యోచిస్తోంది. లేకపోతే దేశీయంగా నాణ్యమైన వస్తువుల కొరత వాటిల్లే ప్రమాదం ఏర్పడనుంది.