Begin typing your search above and press return to search.
ఆసిఫాబాద్ జిల్లాలో పెద్ద పులి పంజా ... వేటకు సిద్దమైన అధికారులు
By: Tupaki Desk | 12 Nov 2020 7:00 PM ISTతెలంగాణ జిల్లాలో పెద్ద పులుల దాడులు రోజురోజుకీ పెరిగి పోతున్నాయి. తాజాగా అసిఫాబాద్ జిల్లా దహెగాం మండలం పెద్ద వాగు సమీపంలో దిగిడ గ్రామానికి చెందిన సిడాం విఘ్నేష్ అనే ఆదివాసీ యువకుడిపై పెద్ద పులి దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. విఘ్నేష్‌ను నోట కరుచుకున్న పులి అడవిలోకి లాక్కెళ్లింది. పులి దాడిలో గిరిజన యువకుడు విఘ్నేష్ మృతి చెందగా మరో ఇద్దరు 12లోపు పిల్లలు నవీన్, శ్రీకాంత్ పులి నుంచి దూరంగా పరుగులు తీసి ప్రాణాలను దక్కించుకున్నారు. అనంతరం జిల్లా అటవీశాఖ అధికారి శాంతారాం, కాగజ్‌నగర్ డీఎఫ్ వో విజయ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మరోవైపు పెద్ద పులిని అదుపులోకి తీసుకునేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ క్రమంలో నేడు పులిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు బోను ఏర్పాటు చేయబోతున్నారు.
దిగిడాలో పెద్ద పులి దాడిలో మరణించిన విఘ్నేష్ కుటుంబాన్ని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప పరామర్శించారు. కాగా ఇప్పటి వరకు అదిలాబాద్‌లోని పలు మండలాల్లో గొర్రెలు, మేకలు వంటి పశువులపై పెద్ద పులులు దాడి చేశాయి గానీ.. ఇప్పటి వరకు మనుషులపై దాడి చేసిన ఘటనలు అరుదు. అయితే మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి ప్రాణహిత నది దాడి పులులు వస్తుండటంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లా తడోబా అందేరీ అభయారణ్యంలో 160 పులులు ఉండగా.. ఈ ఏడాది పులుల దాడిలో ఇప్పటి వరకు 20 మంది మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. తరుచూ పులులు దాడి చేస్తున్న క్రమంలో 50 పులులను ఇతర ప్రాంతాల్లోకి తరలించేందుకు మహారాష్ట్ర అటవీశాఖ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. తడొబా అభయారణ్యంలో ఆవాసాలు ఇరుకుగా మారడంతో తెలంగాణలోకి పులు అడుగు పెడుతున్నట్టు సమాచారం. తెలంగాణలోని కవ్వాల్ టైగర్ జోన్ విస్తరించి ఉన్న ఆసిఫాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్ అటవీ ప్రాంతాలు, ప్రాణహిత నదీ పరివాహక ప్రాంతాలు, బెల్లంపల్లి ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల ప్రాంతాల్లో సైతం పులుల సంచరిస్తున్నట్లు తెలుస్తోంది. రైతులు , పశువుల కాపర్లు అటవి ప్రాంతాల్లోకి వెళ్లవద్దని వార్నింగ్ ఇచ్చారు.ఎవరూ ఒంటరిగా తిరగవద్దంటున్నారు. విఘ్నేష్ పై పులి పంజా విసిరిన తీరు చూస్తుంటే ….మనిషి రక్తం రుచి మరిగిన పులి పనిగా భావిస్తున్నారు ఫారెస్ట్ అధికారులు. సాధారంగా పశువులపై దాడి చేసే పులులు మనషి రక్తం రుచి మరిగితే పశువుల్ని సహించవు. తిరిగి మనిషి మాంసం కోసమే వెదుకుతుంది.