Begin typing your search above and press return to search.

యోగి సంచలనం.. లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా ఆర్డినెన్స్

By:  Tupaki Desk   |   25 Nov 2020 1:20 PM IST
యోగి సంచలనం.. లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా ఆర్డినెన్స్
X
సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే యోగి సర్కారు తాజాగా మరో సంచలన నిర్ణయాన్ని తీసుంది. ప్రేమ పేరుతో హిందూ అమ్మాయిల్ని మోసం చేస్తున్నారంటూ కొన్నేళ్లుగా ఆరోపిస్తున్న బీజేపీ.. తన వాదనకు తగ్గట్లే తాజాగా ఒక ఆర్డినెన్స్ నుతెర మీదకు తీసుకువచ్చింది. లవ్ జీహాద్ కు వ్యతిరేకంగా తీసుకొచ్చిన ఈ ఆర్డినెన్స్ కు యూపీ సర్కారు ఓకే చెప్పింది.

ఈ ఆర్డినెన్స్ ప్రకారం.. ఒకరు బలవంతపు మతమార్పిడికి పాల్పడినట్లు తేలితే.. వారికి ఏడాది నుంచి ఐదేళ్ల వరకు జైలుశిక్ష విధిస్తారు. జైలుశిక్షతో పాటు రూ.15వేల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ.. ఎస్టీ వర్గానికి చెందిన మహిళలు.. మైనార్టీలు మతమార్పిడికి పాల్పడితే మూడు నుంచి పదేళ్ల వరకు జైలుశిక్షతో పాటు రూ.25వేల ఫైన్ వేసేలా ఆర్డినెన్స్ ను జారీ చేశారు.

గత నెలలో జరిగిన ఉప ఎన్నికల ప్రచారంలో తాము త్వరలోనే లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా కఠిన చట్టం చేస్తానని చెప్పిన యోగి.. తాజాగా తన మాటలకు తగ్గట్లే చేతల్లో ఆర్డినెన్స్ ను తీసుకొచ్చారు. ప్రేమ పేరుతో జరుగుతున్న మత మార్పిళ్లకు చెక్ పెట్టటమే ఈ ఆర్డినెన్స్ లక్ష్యమని చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఈ అంశానికి సంబంధించిన బిల్లును యూపీ అసెంబ్లీలో ప్రవేశ పెడతారని చెబుతున్నారు.