Begin typing your search above and press return to search.

తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్.. టీఆర్ఎస్ లోకి మోత్కుపల్లి?

By:  Tupaki Desk   |   23 July 2021 1:17 AM GMT
తెలంగాణ బీజేపీకి బిగ్ షాక్.. టీఆర్ఎస్ లోకి మోత్కుపల్లి?
X
తెలంగాణ బీజేపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. శుక్రవారం ఆయన మీడియా ముందుకు వస్తున్నట్టు చేసిన ప్రకటన ఆసక్తి రేపుతోంది. బీజేపీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరేందుకే మోత్కుపల్లి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం.

ఇటీవల కేసీఆర్ ఏర్పాటు చేసిన దళిత సమావేశానికి బీజేపీ వద్దన్న మోత్కుపల్లి హాజరయ్యారు. కేసీఆర్ కొత్తగా తీసుకొచ్చిన ‘దళిత సాధికారత పథకం’ దళిత బందుకు మద్దతుగా మాట్లాడారు. ఈ క్రమంలోనే బీజేపీ నేతలు మోత్కుపల్లిపై గుర్రుగా ఉన్నారు. బీజేపీ నేతలకు, మోత్కుపల్లి మధ్య ఈ వ్యవహారం చిచ్చు పెట్టింది. పార్టీ ఆదేశాలు కాదని వ్యవహరిస్తున్న మోత్కుపల్లిని ఆ పార్టీ దూరం పెట్టినట్టు సమాచారం. ఈ క్రమంలో బీజేపీపై అసంతృప్తిగా ఉన్న మోత్కుపల్లి టీఆర్ఎస్ ను వీడబోతున్నట్టు తెలుస్తోంది.

దశాబ్ధాలుగా రాజకీయం చేసిన సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు టీడీపీని కాలదన్ని బీజేపీలో చేరారు. చేరినప్పుడు ఉత్సాహంగానే ఉన్నారు. కానీ ఇప్పుడు లేరు. ఇటీవల బీజేపీ వద్దంటున్నా కేసీఆర్ పెట్టిన ‘దళిత నాయకుల సమావేశానికి హాజరయ్యారు’. గులాబీ పార్టీపై ప్రేమ చూపించారు.

బీజేపీ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. దళిత సమావేశానికి హాజరైన మోత్కుపల్లి కేసీఆర్ పై ప్రశంసలు కురిపించారు. పార్టీ ఆదేశించినా కేసీఆర్ సర్కార్ ఏర్పాటు చేసిన అఖిలపక్షానికి వెళ్లిన మోత్కుపల్లిపై బీజేపీ నాయకత్వం ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది.

తెలంగాణలో బీజేపీ దూసుకొస్తోంది. టీఆర్ఎస్ తో ఢీ అంటే ఢీ అంటోంది. అధికార టీఆర్ఎస్ నుంచి కూడా నేతలను లాగేసేలా కనిపిస్తోంది. కానీ బీజేపీలో ఉన్న సీనియర్ నేతను మాత్రం కాపాడుకోలేకపోతోంది. అటు టీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ లలో ప్రజాబలం ఉన్న నేతలను లాగేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంటే ఆ పార్టీలోని సీనియర్ నేత మోత్కుపల్లి టీఆర్ఎస్ కు దగ్గర కావడాన్ని కమలదళం జీర్ణించుకోవడం లేదు.

ఈటల రాజేందర్ బాటలో మరికొందరు నేతలను టీఆర్ఎస్ నుంచి లాగడానికి బీజేపీ స్కెచ్ గీసింది. కానీ మోత్కుపల్లి వ్యవహారంతో ఇప్పుడు బీజేపీ డిఫెన్స్ లో పడిపోయింది. బీజేపీ తరుఫున తాను వెళ్లి మంచి పనిచేశానని.. లేకుంటే బీజేపీపై ‘యాంటీ దళిత’ ముద్ర పడేదని మోత్కుపల్లి వ్యాఖ్యానించి ఆ వర్గాన్ని కమలం పార్టీకి దూరం చేసేలా మాట్లాడడం ఆ పార్టీని ఇరుకునపెట్టినట్టైంది.

దీన్ని బీజేపీలో మోత్కుపల్లి అసంతృప్తిగా ఉన్నాడని అర్థమవుతోంది. కారణం చూసుకొని టీఆర్ఎస్ లోకి రావడానికి యోచిస్తున్నాడని.. కేసీఆర్ ఒకే అంటే పార్టీలో చేరవచ్చని అంటున్నారు. ఈ పరిణామంతో మోత్కుపల్లి టీఆర్ఎస్ లో చేరడం ఖాయమైందని ప్రచారం సాగుతోంది.