Begin typing your search above and press return to search.
హిమాచల్ ఉప ఎన్నికల్లో బీజేపీ కి బిగ్ షాక్ .. కాంగ్రెస్ క్లీన్‌స్విప్
By: Tupaki Desk | 2 Nov 2021 1:15 PM GMTహిమాచల్ ప్రదేశ్‌లో అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఘోర పరాభవాన్ని చవిచూసింది. హిమాచల్ ప్రదేశ్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేసిన లోక్ సభ తో పాటు పలు అసెంబ్లీ సీట్లను కోల్పోయింది. మండి లోక్ సభ స్థానంతోపాటు మూడు అసెంబ్లీ స్థానాల్లోనూ కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. హిమాచల్ ప్రదేశ్‌లో అక్టోబర్ 30న మండి పార్లమెంట్ స్థానంతోపాటు ఫతేపూర్, ఆర్కీ, జుబ్బల్ కోట్‌ఖాయ్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ ఒక్క స్థానంలో కూడా గెలుపొందలేకపోయింది.
మండి పార్లమెంటరీ స్థానంలో మాజీ ముఖ్యమంత్రి వీరభద్రసింగ్ భార్య, కాంగ్రెస్ అభ్యర్థి ప్రతిభా సింగ్, బీజేపీ అభ్యర్థి బ్రిగేడియర్ కుషాల్ ఠాకూర్‌పై గెలుపొందారు. దాదాపు తొమ్మిది వేల ఓట్ల తేడాతో ఆమె గెలుపొందారు. ఫతేపూర్, ఆర్కీ, జుబ్బల్ అసెంబ్లీ స్థానాల్లో కూడా కాంగ్రెస్ గెలుపొందింది. ఫతేపూర్ నుంచి భవానీ సింగ్, ఆర్కీ నుంచి సంజయ్, జుబ్బల్ నుంచి రోహిత్ ఠాకూర్ గెలుపొందారు. దీంతో కాంగ్రెస్ శ్రేణులు వేడుకలు నిర్వహించుకుంటున్నారు.
కాగా.. 2022 వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ ఘోర పరాజయం పాలవ్వడంతో ఆ పార్టీ నాయకులు నిరాశలో కూరుకుపోయారు. మండీలో కాంగ్రెస్ అభ్యర్థిగా హిమాచల్ ప్రదేశ్ మాజీ సీఎం, దివంగత వీరభద్ర సింగ్ సతీమణి ప్రతిభా సింగ్ బరిలో నిలిచారు. ఆమె భాజపా అభ్యర్థి కుశాల్ ఠాకూర్పై ముందంజలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో భాజపా ఇక్కడ భారీ మెజార్టీతో గెలుపొందడం గమనార్హం. అప్పుడు గెలిచిన ఎంపీ రామ్ స్వరూప్ మరణంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది.