Begin typing your search above and press return to search.

సినీ నటి, ఎంపీ నవనీత్ రాణా దంపతులకు మరో షాక్

By:  Tupaki Desk   |   27 April 2022 12:42 PM GMT
సినీ నటి, ఎంపీ నవనీత్ రాణా దంపతులకు మరో షాక్
X
మహారాష్ట్ర గవర్నమెంట్ కు వ్యతిరేకంగా ఎంపీ నవనీత్ కౌర్ కొన్ని రోజులుగా పోరాటం చేస్తోంది. రాష్ట్రంలో శాంతి ఏర్పడాలంటే, సమస్యలు పరిష్కారం కావాలంటే సీఎం ఉద్దవ్ ఠాక్రే ఇంటి ఎదుట హనుమాన్ చాలీసా చదవాలని ఎంపీ నవనీత్ కౌర్ దంపతులు నిర్ణయించారు.

మహారాష్ట్రలో పవర్ ఫుల్ పొలిటికల్ లీడర్ గా పేరు తెచ్చుకున్న నవనీత్ కౌర్ ఆమె భర్త కలిసి తీసుకున్న ఈ నిర్ణయం అలజడి రేపినట్లయింది. దీంతో ప్రభుత్వం వెంటనే స్పందించింది. హైడ్రామా వద్ద పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఆ తరువాత మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని కేసు నమోదు చేశారు. మరోవైపు సీఎం ఇంటిముందు ఎలాంటి అలజడి సృష్టించే కార్యాక్రమాలు చేపట్టొద్దని శివసేన నాయకులు చెబుతున్నారు.

మహారాష్ట్రలో హనుమాన్ చాలీసా వివాదం రచ్చవుతోంది. ఆ రాష్ట్ర సీఎం ఇంటి ముందు ఎంపీ నవనీత్ కౌర్ దంపతులు హనుమాన్ చాలీసా చదువుతామని సవాల్ విసిరారు. దీంతో వారిని శివసేన కార్యకర్తలు అడ్డుకున్నారు. అలాగే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని పోలీసులు నోటీసులు జారీ చేశారు.

ఆ తరువాత వారిని అరెస్టు చేశారు. అయితే కోర్టుకు, ఆ పై లోక్ సభ స్పీకర్ వరకు ఈ వివాదం వెళ్లింది. చివరకు ఎంపీ నవనీత్ కౌర్ ఇచ్చిన ఫిర్యాదుపై లోక్ సభ స్పందించింది. మహారాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. అయితే హనుమాన్ చాలీసా చదవడానికి ఒక పద్దతి ఉంటుందని, కానీ ఎంపీ చేసిన విధానంపైనే చర్యలు తీసుకున్నామని మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాక్రే తెలిపారు.

ఎంపీ స్థానంలో ఉన్న తనను పోలీసులు అరెస్టు చేశారని, తననై నమోదైన కేసును కొట్టివేయాలని నవనీత్ కౌర్ బాంబే హైకోర్టును ఆశ్రయించారు.అయితే అక్కడ ఎంపీకి చుక్కెదురైంది. ఒక సీఎం ఇంటిముందు హనుమాన్ చాలీసా చదువుతామని సవాల్ విసరడం కరెక్ట్ కాదని వారించింది. అంతేకాకుండా గౌరవప్రదమైన పదవుల్లో ఉన్నవారు ఇలాంటి పనులు చేయొద్దని తెలిపింది. దీంతో వారు వేసిన పిటిషన్ ను కొట్టివేసింది. ఆ తరువాత నవనీత్ కౌర్ హైకోర్టును ఆశ్రయించారు. సీఎం ఇంటి ముందు హనుమాన్ చాలీసా చదువుతామని సవాల్ విసరడం తప్పని హైకోర్టు కూడా ఎంపీ దంపతులకు షాక్ ఇచ్చింది.

తాజాగా ఈ వివాదంలోకి శివసేన సీనియర్ ఎంపీ వచ్చాడు. శివసేన సీనియర్ నేత సంజయ్ రౌత్ పై ఫిర్యాదు చేశారు. నవనీత్ రాణా, ఢిల్లీ పోలీస్ కమిషనర్ కు లేఖ రాస్తూ.. శివసేన ఎంపీని కుల పదాలను దూషించారని ఆరోపిస్తూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 420కి కాల్ చేసి సంజయ్ రౌత్ తన పరువు తీశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు.

మరోవైపు శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఇచ్చిన ఫిర్యాదుపై ముంబై పోలీసులు కేసు నమోదు చేయనున్నట్లు తెలుస్తోంది. దావూద్ గ్యాంగ్ కు సన్నిహితుడైన బాలీవుడ్ నిర్మాత యూసఫ్ లక్డావాలా నుంచి రాణా దంపతులు 80 లక్షల రూపాయలు అక్రమంగా వసూలు చేసినట్లు ముంబై పోలీసులకు సంజయ్ రౌత్ ఫిర్యాదు చేశారు. దావూద్ గ్యాంగ్ సంబంధాలపై ఇప్పటికే ముంబై పోలీసులు లక్డావాలాను అరెస్ట్ చేశారు. తనను ముంబై పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేశారు నవనీత్ రాణా. ఈ వ్యవహారంలో మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక కోరింది కేంద్ర హోంశాఖ.

ఇక సంజయ్ రౌత్ పై కూడా ఢిల్లీ పోలీసులకు నవనీత్ రాణా ఫిర్యాదు చేశారు. అమరావతి లోక్ సభ నియోజకవర్గం షెడ్యూల్ కులాలకు రిజర్వ్ చేయబడినందున, నేను మొదటిసారిగా 2014లో శివసేన అభ్యర్థిపై పోటీచేశానని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.. తనను మొదటి ఎన్నికల నుంచి శివసేన అభ్యర్థులు బెదిరిస్తున్నారని.. కులం గురించి ఆరోపిస్తున్నారని తెలిపారు. తనను కుటుం పేరుతో రౌత్ దూషించారని.. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆమె ఢిల్లీ పోలీస్ కమిషనర్ రాకేష్ ఆస్థానాకు లేఖ రాశారు.