Begin typing your search above and press return to search.

బిగ్ బ్రేకింగ్... ప్రధాని ఇంటిలో ఫైర్ యాక్సిడెంట్

By:  Tupaki Desk   |   30 Dec 2019 9:26 PM IST
బిగ్ బ్రేకింగ్... ప్రధాని ఇంటిలో ఫైర్ యాక్సిడెంట్
X
నిజంగానే ఈ వార్త బిగ్ బ్రేకింగనే చెప్పాలి. ఎందుకంటే దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ నివసిస్తున్న అధికారిక నివాసంలో కాసేపటి క్రితం అగ్ని ప్రమాదం సంబంవించింది. ఈ ప్రమాదం చిన్నదేమీ కాదని, భారీ ప్రమాదమేనన్న వార్తలు నిజంగానే కలకలం రేపుతున్నాయి. ప్రధాని హోదాలో మోదీ దేశ రాజధాని ఢిల్లీలోని అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉన్న కళ్యాణ్ మార్గ్ లో నివాసం ఉంటున్నారు. వీవీఐపీలు నివాసం ఉండే ఈ ప్రాంతంలో చీమ చిటుక్కుమన్నా కూడా అధికార యంత్రాంగం ఉరుకులు పరుగులు పెడుతుంది. అంతేకాకుండా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాత్రగత్తలు కూడా చాలానే ఉంటాయి.

ఎంతటి ముందు జాగ్రత్తలు కలిగినా కూడా ఏకంగా ప్రధాని మోదీ అధికారిక నివాసంలోనే అగ్ని ప్రమాదం సంభవించిందంటే... సామాన్య విషయం కాదనే చెప్పాలి. ఈ ప్రమాదంలో ఏ మేర నష్టం జరిగిందన్న విషయం ఇంకా బయటకు రాలేదు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదట. సోమవారం రాత్రి 7.25 గంటల సమయంలో.. 7 లోక్ కళ్యాణ్ మార్గ్‌ లోని మోదీ నివాసంలో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు. 9 ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నారు. వెంటనే అంబులెన్సులు కూడా ప్రధాని నివాసానికి చేరుకున్నాయి.

ప్రధాని నివాసంలోని ఎలక్ట్రిక్ కంట్రోల్‌ రూంలో మంటలు చెలరేగినట్టుగా ప్రాథమిక సమాచారం. అయితే అగ్ని ప్రమాదానికి గల స్పష్టమైన కారణాలను అధికారులు వెల్లడించలేదు.

వెంటనే అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్త చర్యగా ప్రధాని నివాసానికి వెళ్లే మార్గాలను మూసివేశారు. ఢిల్లీలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ.. కట్టుదిట్టమైన భద్రత చర్యలు ఉండే ప్రధాని నివాసంలో అగ్ని ప్రమాదం తలెత్తడం పలు అనుమానాలకు తావిస్తోంది.