Begin typing your search above and press return to search.

బిగ్ బ్రేకింగ్: 22 మంది ఉన్న విమానం అదృశ్యం..

By:  Tupaki Desk   |   29 May 2022 7:50 AM GMT
బిగ్ బ్రేకింగ్:  22 మంది ఉన్న విమానం అదృశ్యం..
X
ఈ మధ్యకాలంలో విమాన ప్రమాదాలు తరుచూ జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మరో విమానం గల్లంతు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. నేపాల్ కు చెందిన విమానం ఆచూకీ తెలియడం లేదు.

‘తారా ఎయిర్ లైన్స్’కు చెందిన 9 ఎన్ఏఈటీ ట్విన్ ఇంజిన్ విమానం.. ఆదివారం ఉదయం పోఖ్రా నుంచి జమ్సోమ్ కు బయలు దేరింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంతో సంబంధాలు తెగిపోయాయి. విమానంలో 22 మంది ప్రయాణికులు ఉండగా.. వీరిలో నలుగురు భారతీయులు ఉన్నారని సమాచారం.

ఉదయం 9.55 గంటల ప్రాంతంలో సంబంధాలు తెగిపోయాయని సమాచారం. జెమ్ సమ్ ప్రాంతంలోని ముస్తాంగ్ జిల్లాలోని గగనతలంలో చివరగా విమానం కనిపించిందని.. ఆ తర్వాత విమానంతో సంబంధాలు తెగిపోయాయని అధికారులు తెలిపారు.

జెమ్ సమ్ జిల్లాలోని ఘాసాలో పెద్ద శబ్ధం వచ్చిందని చెబుతున్నారు. దీంతో ఆ ప్రాంతానికి సెర్చ్ కోసం హెలిక్యాప్టర్ పంపబడింది. విమానంలో 13మంది నేపాలీలు, నలుగురు భారతీయులు , ఇద్దరు జర్మన్లు, ముగ్గురు సిబ్బంది ఉన్నారు.

పఖోరా నుంచి జెమ్ సమ్ వెళ్తున్న సమయంలోనే రాడార్ తో సంబంధాలు తెగిపోయాయి. దీంతో విమానం కూలిపోయిందా? లేక టెక్నికల్ ప్రాబ్లమా? అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే కూలిపోయినట్టు ఆధారాలు లభించలేదు.