Begin typing your search above and press return to search.

ఫలితాల ముగింపు వేళ.. జోబిడెన్ తొలి స్పీచ్

By:  Tupaki Desk   |   5 Nov 2020 12:40 PM IST
ఫలితాల ముగింపు వేళ.. జోబిడెన్ తొలి స్పీచ్
X
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోబిడెన్ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఆయన ముందంజలో ఉన్నారు. ఓట్ల లెక్కింపు తుదిదశకు చేరుతున్న వేళ కీలకంగా ఉన్న ఆరు పెద్ద రాష్ట్రాల్లో డెమొక్రాట్లు పుంజుకున్నారు. మొదట వెనుకంజలో ఉన్న అరిజోనా, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో విజయం సాధించారు. మిచిగాన్, మిన్నెసొటాలో మెజారిటీ సాధించారు. దీనితో చివరి రౌండ్‌లో ఫలితాలు ఒక్కసారిగా డొమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్‌కు అనుకూలంగా మారాయి. చివరి రౌండ్ లో జార్జియా, నార్త్ కరొలినా, పెన్సిల్వేనియాల్లో రిపబ్లికన్లు ఆధిక్యతలో కొనసాగుతున్నారు.

మ్యాజిక్ ఫిగర్ కు చేరువగా 270 ఎలక్ట్రోరల్ ఓట్లకు గాను ప్రస్తుతం బిడెన్ ఖాతాలో 264 ఖాతాలో 264 ఉన్నాయి. దీంతో బిడెన్ విజయం దాదాపుగా ఖాయమైనట్టే.

ఈ పరిణామాల మధ్య జోబిడెన్ తొలిసారిగా అమెరికన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. డెల్వర్ లోని విల్మింగ్టన్ నుంచి ఆయన అమెరికన్లను ఉద్దేశించి మాట్లాడారు. అమెరికన్లు, ప్రత్యర్థి పార్టీ రిపబ్లికన్లను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాము ఘన విజయాన్ని సాధించామని జోబిడెన్ చెప్పారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సమయానికి తాము చాంపియన్లుగా ఆవిర్భవిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మిచిగాన్ లో తాము విజయం సాధించామని అన్నారు. అమెరికాలో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతోందని.. ప్రజల ఆశలకు అనుగుణంగా పనిచేస్తుందని హామీ ఇచ్చారు.ఈ విజయం తన ఒక్కడిది మాత్రమే కాదని, ప్రతి ఒక్క అమెరికన్‌కూ ఈ ఘనత దక్కుతుందని వ్యాఖ్యానించారు. అమెరికన్లు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టారని అన్నారు. తాను సాధించిన ఈ విజయంలో రాజకీయ సలహాదారులు, వ్యూహకర్తలకూ భాగం ఉందని ప్రశంసించారు.

అమెరికాలో ఈసారి ప్రజానుకూల ప్రభుత్వం ఏర్పడబోతోందని జోబిడెన్ అన్నారు. ట్రంప్ నియంతృత్వ ప్రభుత్వం ఉండదని స్పష్టం చేశారు. ప్రజలు ఎన్నుకున్న వారే అధికారంలో కూర్చోవాల్సి ఉంటుందే తప్ప.. మరొకరు కాదని సుప్రీం కోర్టును ఉద్దేశించి మాట్లాడారు. ఈ ఎన్నికల్లో ప్రతీ అమెరికన్ విజయం సాధించారని బిడెన్ అన్నారు.