Begin typing your search above and press return to search.
బైడెన్ భారీ హామీ.. గెలిస్తే.. కోటి మందికి సుడి తిరిగినట్లే
By: Tupaki Desk | 16 Oct 2020 2:30 PM ISTనోటికి వచ్చినట్లుగా హామీలు ఇవ్వటానికి అదేమీ భారత్ కాదు. ఇచ్చిన హామీలో ఏ మాత్రం లెక్క తేడా వచ్చినా మొదటికే రావటం ఖాయం. అందునా కీలకమైన అధ్యక్ష ఎన్నికల వేళ.. ఆ స్థానానికి పోటీ పడుతున్న అభ్యర్థుల నోటి నుంచి వచ్చే ప్రతి మాటా కౌంట్ లోకి వస్తుంది. మరో రెండు వారాల్లో అధ్యక్ష ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న వేళ.. డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్ కీలక హామీని ఇచ్చారు. గేమ్ ఛేంజర్ గా భావిస్తున్న ఈ హామీ బైడెన్ ను ముంచుతుందా? తిరుగులేని అధిక్యతను తీసుకొస్తుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
తాజాగా నిర్వహించిన ఆన్ లైన్ విరాళాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న బైడెన్.. తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే రూ.1.10 కోట్ల మంది అక్రమ వలసదారులకు అమెరికా పౌరసత్వంఇస్తానని హామీ ఇచ్చారు. వలసల సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్న ఆయన.. ట్రంప్ కారణంగా దేశానికి జరిగిన నష్టానని పూడ్చటం కష్టమైన పనిగా అభివర్ణించారు.
ట్రంప్ అసమర్థ నిర్ణయాల కారణంగా 2.15 లక్షల మంది అమాయకుల ప్రాణాల్ని కోల్పోయినట్లుగా ఆరోపించారు. ప్రస్తుతం అమలవుతున్న ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ సరిగా లేదన్న ఆయన.. అక్రమ వలసదారుల్ని వెనక్కి పంపుతామని అదే పనిగా ట్రంప్ అంటున్నారని..తాను మాత్రం వలసలకు పౌరసత్వం ఇస్తానని పేర్కొన్నారు. బైడైన్ ప్రకటన.. వలసలకు వ్యతిరేకంగా ఉండే ఓటు బ్యాంకును సమీకరించే వీలుంది. అది ట్రంప్ నకు అనుకూలంగా మారనుంది. అదే సమయంలో.. అమెరికాలో ఉన్న వారంతా అమెరికన్లుగా గుర్తింపు పొందటానికి పడే తాపత్రం అంతా ఇంతా కాదు. అమెరికా అందరికి నెలవు అన్నమితవాదుల వాదనకు బైడైన్ తాజా హామీ విపరీతంగా ఆకర్షించే వీలుంది. మొత్తంగా.. భారీ హామీనే ఇచ్చారని చెప్పాలి. మరి.. దీనికి ట్రంప్ ఎలాంటి కౌంటర్ ఇస్తారన్నది ఇప్పుడు ప్రశ్నగా మరినట్లే.