Begin typing your search above and press return to search.

తాజా పోల్ సర్వే ..ట్రంప్ ను వెనక్కి నెట్టిన బిడెన్!

By:  Tupaki Desk   |   11 Jun 2020 1:40 PM IST
తాజా పోల్ సర్వే ..ట్రంప్ ను వెనక్కి నెట్టిన బిడెన్!
X
అగ్రరాజ్యం అమెరికాలో ఎన్నికలకి మరెంతో సమయం లేదు. ఎన్నికల సమయం దగ్గరపడుతుండడంతో అక్కడి రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తాజా సర్వేల్లో ట్రంప్ కాస్త వెనకంజలో ఉన్నట్లు స్పష్టం చేస్తున్నాయి.అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న డెమొక్రాటిక్ పార్టీ నామినీ జో బిడెన్.. తాజా సర్వేల్లో ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కంటే ముందున్నారు. CNN కోసం SSRS జరిపిన సర్వేలో ట్రంప్ కంటే బిడెన్ ఎక్కువ పాయింట్లు సాధించాడు.

దేశవ్యాప్త సర్వేలో ట్రంప్కు 41 శాతం ఓట్లు వస్తే.. బిడెన్కు 55 శాతం ఓట్లతో మాంచి లీడ్ లో ఉన్నారు. ట్రంప్ మద్దతుదారుల్లో ప్రతి పది మందిలో ఏడుగురు తిరిగి ట్రంప్ను రీఎలెక్ట్ చేస్తామని చెప్పారు. ఇక 27 శాతం మంది బిడెన్కు వ్యతిరేకంగా ఓటు వేస్తామని చెప్పారు. బిడెన్ ఓటర్లలో 37 శాతం మంది మాత్రమే ప్రోబిడెన్ ప్లాన్కు ఓకే చెప్పారు. 60 శాతం మంది ట్రంప్కు వ్యతిరేకంగా ఓటు వేస్తాం అని తెలిపారు.

ఆదివారం రిలీజ్ చేసిన ఎన్బీసీ న్యూస్/వాల్ స్ట్రీట్ జర్నల్ పోల్ లో కూడా బిడెన్ ట్రంప్ కంటే ముందంజలో ఉన్నారు. బిడెన్ కు 49 శాతం ఓట్లు వస్తే.. ట్రంప్ కు 42 శాతం మాత్రమే ఓట్లు వచ్చాయి. కానీ CNN సర్వేలో బిడెన్ 50 శాతం మార్కును దాటారు . అయితే, 2016 ఎన్నికల క్యాంపెయిన్ టైమ్ లో ట్రంప్ ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ నేషనల్ పోల్స్ లో ఈ ఫీట్ సాధించలేక పోయారు. కాగా, ప్రస్తుతం అమెరికాలో వైరస్ ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ఈ సమయంలో అమెరికాలో చివరికి ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతారో వేచి చూడాలి.