Begin typing your search above and press return to search.

కరోనా కట్టడికి బైడెన్ కీలక నిర్ణయం !

By:  Tupaki Desk   |   26 Jan 2021 12:14 PM IST
కరోనా కట్టడికి  బైడెన్ కీలక నిర్ణయం  !
X
కరోనా మహమ్మారి జోరు ప్రపంచంలో ఇంకా కొనసాగుతుంది. ఇప్పుడిప్పుడే పలుదేశాల్లో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇదిలా ఉంటే కరోనా వైరస్ పలు విధాలుగా రూపాంతరం చెందుతూ ప్రపంచం పై పడుతుంది. ఇక అమెరికాలో కరోనా మహమ్మారి జోరు ఇంకా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కొత్తగా అమెరికా అధ్యక్షుడిగా భాద్యతలు తీసుకున్న బైడెన్ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. 26 యూరప్ దేశాల నుంచి వచ్చే పౌరుల ప్రయాణాలపై ఆంక్షలను విధించాలని ఆయన యోచిస్తున్నారు.

ఇదే నేపథ్యంలో బ్రెజిల్, ఐర్లాండ్, యూకేలతో సహా 26 ఇతర యూరోపియన్‌ దేశల నుంచి వచ్చే అమెరికా యేతర పౌరుల ప్రయాణాలపై మరోసారి ఆంక్షలు విధించేందుకు సిద్ధమౌతున్నట్టు అమెరికా వైట్‌ హౌస్‌ అధికారులు వెల్లడించారు. దక్షిణాఫ్రికాలో కొత్త రకం వైరస్ వెలుగులోకి రావడంతో ఆ దేశాన్ని కూడా ఈ జాబితాలో చేర్చే అవకాశాలు ఉన్నాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి. కాగా, తాను అధ్యక్ష బాధ్యతల నుంచి తొలగిపోయే చివరి రోజుల్లో డొనాల్డ్ ట్రంప్, అప్పటి వరకూ అమలులో ఉన్న ట్రావెల్ ఆంక్షలను తొలగించిన సంగతి తెలిసిందే. ఆపై కరోనా కేసుల సంఖ్య మరింతగా పెరుగుతూ ఉండటంతో, తిరిగి ఆంక్షలను విధించేందుకు బైడెన్ సమాయత్తం అవుతున్నారు.