Begin typing your search above and press return to search.

బైడెన్ మరో కీలక నిర్ణయం...భారత్ లో అమెరికా రాయబారిగా ఎరిక్ !

By:  Tupaki Desk   |   10 July 2021 6:30 AM GMT
బైడెన్ మరో కీలక నిర్ణయం...భారత్ లో అమెరికా రాయబారిగా ఎరిక్ !
X
అమెరికా ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన ఇన్ని రోజులకి జోబైడెన్ భారత్ కు సంబంధించి అతి కీలక నిర్ణయం తీసుకున్నారు. ట్రంప్ హయాంలో భారత్, అమెరికాల మధ్య బంధానికి రాజకీయ రంగులూ అంటుకున్నాయి, భారత ప్రధాని నరేంద్ర మోదీ పబ్లిక్‌ గా రిపబ్లిక్లకు మద్దతుపలకడం, అయినాసరే ఎన్నికల్లో డెమోక్రాట్లే గెలుపొందడం తెలిసిందే. ట్రంప్ కి భిన్నంగా తన హయాంలో ఇరు దేశాల సంబంధాలు ఉండాలని భావిస్తోన్న బైడెన్ భారత్ కు కొత్త రాయబారిని నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్ లో అమెరికా రాయబారిగా ఎరిక్ గార్సెట్టి పేరును అధ్యక్షుడు జోబైడెన్ నామినేట్ చేశారు. ప్రస్తుతం లాస్ ఏంజిల్స్ సిటీ మేయర్ గా ఉన్న ఎరిక్ గార్సెట్టి పేరు ముందు నుంచీ ఈ నియామకంలో వినిపిస్తూనే ఉంది.

భారత్‌ లో అమెరికా కొత్త రాయబారిగా లాస్ ఏంజెల్స్ మేయ‌ర్ ఎరిక్ గార్సెట్టిని నామినేట్ చేశారు అధ్యక్షుడు జో బైడెన్‌. సెనేట్ ధ్రువీకరిస్తే ఎరిక్‌ గార్సెట్టి రాయబారిగా బాధ్యతలు స్వీకరిస్తారు. ట్రంప్ హయాంలో రాయబారిగా పనిచేసిన జస్టర్ స్థానంలో 50 ఏళ్ల గార్సెట్టి నియమితులవుతారు. జస్టర్ కౌన్సిల్ ఆన్ ఫారెన్ రిలేషన్స్లో ఎరిక్‌ విశిష్ట సహచరుడని శ్వేతసౌధం తెలిపింది. 2013 నుంచి ఆయన లాస్ ఏంజెల్స్ మేయర్‌ గా ఉన్నారని ఓ ప్రకటనలో వెల్లడించింది. భారత్‌ తో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా బైడెన్‌ తనకు అత్యంత విశ్వాసపాత్రుడైన ఎరిక్‌ను రాయబారిగా నామినేట్‌ చేశారని శ్వేతసౌథం తెలిపింది. అయితే, ఈ నామినేషన్ పై హర్షం వ్యక్తం చేశారు ఎరిక్ గార్సెట్టి. సక్రమంగా విధులు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.