Begin typing your search above and press return to search.
ఓటుకు నోటు కేసులో బాబుపై చర్యలేవి?
By: Tupaki Desk | 9 May 2018 9:25 AM GMTఓటమి కుంగదీస్తుంది. గెలుపు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. అయితే.. ఈ రెండింటిలో ఏది మోతాదు మించినా తిప్పలే. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఒకింత నిరాశను.. నిస్పృహను నింపేసింది. అయితే.. దాని నుంచి పార్టీని బయటపడేసేందుకు జగన్ స్టార్ట్ చేసిన ప్రజాసంకల్ప యాత్ర ఆ పార్టీలో నేతల్ని.. కార్యకర్తల్ని ఉత్సాహంతో ఉరకలెత్తేలా చేస్తోంది.
జగన్ సభలకు పోటెత్తుతున్న ప్రజలతో పార్టీలో ఇప్పుడో కొత్త ఉత్సాహం పొంగిపొర్లుతోంది. ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. అధికారపక్షంపై విరుచుకుపడేందుకు అస్త్రశస్త్రాల్ని సిద్ధం చేసుకోవటమే కాదు.. పదునైన విమర్శలతో రాజకీయ ప్రత్యర్థులకు బీపీ వచ్చేలా చేస్తున్నారు. తాజాగా అలాంటి తీరునే ప్రదర్శించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూమన కరుణాకర్ రెడ్డి.
ఏ విషయాన్ని ప్రస్తావిస్తే బాబు ఉలిక్కిపడతారో.. సరిగ్గా అదే విషయాన్ని టచ్ చేసిన ఆయన.. ఓటుకు నోటు కేసులో సీఎం చంద్రబాబు అడ్డంగా బుక్ అయ్యారని.. ఆయనపై ఇప్పటివరకూ చర్యలు తీసుకోలేపోవటాన్ని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో బ్రీఫ్ డ్ మీ అంటూ బయటకు వచ్చిన ఆడియో టేప్ లో ఉన్నది బాబు వాయిసేనని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ వాయిస్ బాబుదేనని ఫోరెన్సిక్ నివేదిక వచ్చినప్పటికీ బాబుపైన చర్యలు తీసుకోలేదన్న భూమన.. బాబుపై చట్ట ప్రకారం ఎలాంటి యాక్షన్ తీసుకోవటంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఈ కేసులో దోషులు ఎవరో స్పష్టం చేయాలన్న ఆయన మాటలు ఏపీ ముఖ్యమంత్రికి.. ఆయన అనుచర వర్గానికి ఇబ్బందికరంగా మారాయని చెప్పక తప్పదు. ఏ కేసు ముచ్చట అయితే ఎవరూ ప్రస్తావించకూడదని బాబు అనుకుంటారో అదే విషయాన్ని పదే పదే ప్రస్తావించటం బాబు బ్యాచ్‌కు ఇబ్బందిగా ఉండకుండా ఉంటుందా?