Begin typing your search above and press return to search.

తమ్ముళ్లకు ఎదురుదెబ్బ; భూమాకు బెయిల్‌

By:  Tupaki Desk   |   8 July 2015 9:59 AM GMT
తమ్ముళ్లకు ఎదురుదెబ్బ; భూమాకు బెయిల్‌
X
తెలంగాణలో కేసుల ఇబ్బంది పడుతున్న ఏపీ అధికారపక్షం.. తన రాష్ట్రంలోని విపక్ష పార్టీ నేతలపై కేసుల్ని బనాయిస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ మధ్యనే ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా పోలింగ్‌ స్టేషన్‌ వద్ద.. నంద్యాల ఎమ్మెల్యే.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత భూమా నాగిరెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేయటం తెలిసిందే.

పోలీసుఅధికారిని దూషించారన్న అంశంపై ఎస్టీ.. ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టటంపై విపక్షం తీవ్రస్తాయిలో మండిపడింది. అనారోగ్యంతో ఉన్న భూమాను జైలుకు తరలించకుండా.. కర్నూలు ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ఆయన అనారోగ్యంతో ఉండి హైదరాబాద్‌ నిమ్స్‌కు తరలించాలని డాక్టర్లు చెప్పినప్పటికీ అధికారులు అందుకు అంగీకరించలేదంటూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌ మండి పడ్డారు కూడా.

తాజాగా భూమాకు బెయిల్‌ ఇస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. డోన్ట్‌ టచ్‌ మీ అన్న పదం ఎస్సీ..ఎస్టీ అట్రాసిటీ చట్టంకు వర్తించదన్న న్యాయమూర్తి.. ఎమ్మెల్యే భూమాకు బెయిల్‌ ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు. తమను తెలంగాణ అధికారపక్షం కేసులు బనాయించి ఇబ్బంది పెడుతుందని వాపోతున్న తమ్ముళ్లు.. తాము అధికారంలో ఉన్న రాష్ట్రంలో విపక్షాన్ని అదే తీరుతో ఇబ్బంది పెట్టటాన్ని ఏమనాలన్న విమర్శలు వినిపిస్తున్నాయి.